Publish Date:Aug 24, 2026
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అడుగులు ఎటు అన్న విషయంపై ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో చర్చ జోరుగా నడుస్తోంది. శాసనమండలిలో వైసీపీ పక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ జనసేన వైపు చూపు సారించారన్న చర్చ జోరందుగుంది. ఆయన రాజకీయ అడుగులు జనసేన వైపు పడుతున్నాయని వైసీపీలోనే వినిపిస్తున్నది. ఆయన ఇప్పటికే జనసేన అగ్రనేతతో ఈ విషయంగా చర్చలు జరిపారని గట్టిగా వినిపిస్తోంది.
ఈ విషయంలో బొత్స సత్యనారాయణ స్వయంగా స్పందిస్తూ ఈ ప్రచారాన్ని ఖండించారు. తాను పార్టీ మారుతాన్న ప్రచారం పూర్తిగా ఆధారరహితమని స్పష్టం చేశారు. ఇదంతా మైండ్ గేమ్ లో భాగమని కొట్టి పారేశారు. బొత్స స్వయంగా ఖండిచినా ఆయన జనసేనకు షిఫ్ట్ అవుతారన్న ప్రచారం ఇసుమంతైనా తగ్గలేదు. రాజకీయ పరిశీలకులు సైతం బొత్సలో జనసేన, వైసీపీల మధ్య ఊగిసలాట కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు. స్థానిక ఎన్నికలలో పార్టీ పోటీపై వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకున్న జనసేనాని.. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్న తరుణంగా బొత్స జనసేన వైపు మొగ్గు చూపే అవకాశాలను కొట్టి పారేయలేమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
తాజాగా బొత్స ఇటీవలి మౌనాన్ని వీడి మండలిలోనూ, బయటా కూడా తెలుగుదేశం పై, మంత్రి లోకేష్ పై విమర్శలకు పదును పెట్టడం, అదే సమయంలో జనసేన పట్ల ఒకింత మెతక వైఖరిని అవలంబించడం ఇందుకు తార్కానాలుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద బొత్స రాజకీయ అడుగుల విషయంలో అటు వైసీపీలోనూ, ఇటు జనసేనలోనూ కూడా ఆసక్తికర చర్చ అయితే జరుగుతోంది.
Botsa Satyanarayana, Janasena Party, YSRCP, AP Politics, Vizianagaram Politics
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/-botsa-satyanarayana-25-229698.html
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు