బీజేపీ 46 ఏళ్ల ప్రస్థానం!

Publish Date:Apr 6, 2026

Advertisement

1980 ఏప్రిల్ 6న న్యూఢిల్లీలోని కోట్లా మైదానంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో బిజెపి అధికారికంగా ఆవిర్భవించింది. భారత రత్న అటల్ బిహారీ వాజ్‌పేయి ఈ పార్టీకి మొదటి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆనాటి సభలో ఆయన చేసిన అంధేరా ఛాటేగా, సూరజ్ నిక్లేగా, కమల్ ఖిలేగా ప్ర‌క‌ట‌నే నేడు నిజ‌మైంద‌ని అంటారు క‌మ‌ల‌నాథులు. తెలుగులో దీన‌ర్ధం ఏమిటంటే.. చీకటి తొలగుతుంది, సూర్యుడు ఉదయిస్తాడు, కమలం వికసిస్తుంది. ఆ నినాదం ఇప్పటికీ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.

బిజెపికి  1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్‌తో పునాదులు పడ్డాయి.  అక్క‌డి నుంచి ఈ పార్టీ అంచ‌లంచ‌లుగా ఎదిగి నేడీ స్థితికి చేరుకుంది. గ‌తంలో వాజ్ పేయి ఈ పార్టీకి అధికార వాస‌న రుచి చూప‌డంతో.. ఇప్పుడు వ‌రుస‌గా మూడు ప‌ర్యాయాల పాటు అధికారం చేజిక్కించుకుని.. ప్ర‌స్తుతం అప్ర‌తిహాత జైత్ర యాత్ర చేస్తోంది. 

2026లో బీజేపీ 46వ‌ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున నిర్వ‌హిస్తోంది. ఏప్రిల్ 5 నుండి 12 వరకు వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలను చేస్తోంది. ఈ వారోత్స‌వాల్లో భాగంగా.. వికాస్ యాత్రలు, సేవా కార్యక్రమాల‌ను ప్లాన్ చేసింది బీజేపీ. ప్రతి బూత్ స్థాయిలో జెండా  ఆవిష్కరణ,  పార్టీ సిద్ధాంతకర్తలు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటాలకు నివాళులర్పించడం వంటివి చేస్తోంది.   కార్యకర్తలు తమ ఇళ్లపై పార్టీ జెండాను ఎగురవేసి, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇక గ్రామ బస్తీ చలో కార్య‌క్ర‌మం విష‌యానికి వ‌స్తే.. ఏప్రిల్ 7 నుండి 12 వరకు నాయకులు గ్రామాల్లో పర్యటించి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టారు. తెలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీ బలోపేతం దిశగా అడుగులు వేస్తూ.. ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. 

తెలంగాణ‌లో 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీల‌తో కమలం పార్టీ బలంగా ఉంది.  ఇక ఎమ్మెల్సీ, మున్సిపాల్టీల్లోనూ ప‌ట్టు నిలుపుకుంటూ వ‌స్తోంది. వ‌చ్చే  ఎన్నిక‌ల‌లో అధికారమే టార్గెట్ గా అడుగులు వేస్తు ముందుకు సాగుతోంది.  ఇక ఆంధ్రప్రదేశ్‌లో  తెలుగుదేశం, జనసేనలతో పొత్తు పెట్టుకుంది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా కూడా ఉంది.  అటు కేంద్రంలో, ఇక్కడ రాష్ట్రంలో కూడా  కూటమి అధికారంలో ఉండటంతో, అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు నిధులు, మరియు విశాఖ స్టీల్ ప్లాంట్ వంటి కీలక అంశాల్లో కేంద్రం నుంచి ల‌బ్ధి పొందడంలో బిజెపి   వారధి గా పనిచేస్తోంది. రాష్ట్ర మంత్రివర్గంలో బిజెపికి ప్రాతినిధ్యం ఉంది. సత్యకుమార్ యాదవ్ వంటి నేతలు మంత్రివర్గంలో కీలక శాఖలను నిర్వహిస్తున్నారు.  కూటమి ప్రకటించిన సూపర్ సిక్స్ హామీల అమలులో, కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేయడంలో బిజెపి చురుకైన పాత్ర పోషిస్తోంది.

ఇక దేశవ్యాప్తంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ అత్యధిక రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. సొంతంగా బిజెపి ముఖ్యమంత్రులు   14 రాష్ట్రాలలో, బీజేపీ యేతర సీఎంలు ఉన్నప్పటికీ  ఎన్డీయే అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఏడు ఉన్నాయి. అంటే దేశంలో మొత్తం 21 రాష్ట్రాలలో   ప్ర‌స్తుతం బీజేపీ  నాయ‌క‌త్వంలోని ఎన్డీయే కూట‌మి అధికారంలో ఉంది.
 
ప్రస్తుతం  అసోం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత అంటే మే 4న ఈ లెక్కల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో ఈసారి బిజెపి గట్టి పోటీనిస్తోంది.  

ఏది ఏమైనా బీజేపీ త‌న రాజ‌కీయ ప్ర‌స్థానంలో స్వ‌ర్ణ‌యుగంలాంటి రోజుల‌ను ఆస్వాదిస్తోంది. దేశ వ్యాప్తంగా అత్య‌ధిక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ.. గా ఈ ఏడాది ఆవిర్భావ ఏడుక‌ల‌ను ఎంతో ఘ‌నంగా  నిర్వ‌హిస్తోంది.  

By
en-us Political News

  
అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది, దీని ఫలితాన్ని అనేక నిర్మాణాత్మక మరియు రాజకీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం తన చోటుకు ఎసరు వస్తున్నదా అన్న అనుమానంతో.. ఆ కాపు నేత తానేనని చాటుకోవడానికి తన వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారంటున్నారు. నేను సైతం అంటూ ఆయన రంగంలోకి దిగినట్లు వైసీపీ వర్గీయులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఇందుకు తార్కానాలు కూడా చూపుతున్నారు.
ఉభయ సభలలో ఆమోదం పొందిన ఆ బిల్లు ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరింది. ఇక ఆమె సంతకం పెట్టడానూ ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఆమె నేడో, రేపో ఈ బిల్లుపై సంతకం చేయడం ఖాయమని అంటున్నారు.
తమిళనాడులో 2026 ఎన్నికలు హోరాహోరీగా సాగే పోరుగా రూపుదిద్దుకుంటున్నాయి, ఇందులో స్పష్టమైన విజేత ఎవరూ లేరు. స్వల్ప ఓట్ల మార్పులు సీట్ల ఫలితాలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపవచ్చు.
రాజకీయం అంటే కేవలం అధికారంలో ఉండటం మాత్రమే కాదని, ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ ముందుకు సాగాలని వైసీపీకి హితవు పలుకుతున్నట్లుగా మాట్లాడుతూనే.. ఆ పార్టీకి కర్తవ్యబోధ చేశారు.
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఎండలు మండిపోతాయి. వడగాలుల ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది.
రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారాయి.
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్.. ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
మూడు రాజధానుల అంశం గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటి అన్న విషయాన్ని విస్మరించి.. మళ్ళీ అదే తరహా ప్రత్యామ్నాయ వాదనలు వినిపించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది. పార్టీ కేడర్ సైతం మావిగన్ ఏంటి అదేదో పంటకు పట్టే తెగుల్లా ఉందని నెత్తీ నోరూ బాదుకుంటోంది.
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ సంస్కృతి ఒక పెను సవాలుగా మారింది. ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులు, ప్రముఖుల పేర్లు డ్రగ్స్ కేసుల్లో వినిపిస్తుండటం సమాజంలో తీవ్రసంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వాస్తవ వేదిక చర్చలో డోలేంద్ర ప్రసాద్, కంఠంనేని రవిశంకర్ లు ఇది కేవలం శాంతిభద్రతల సమస్య మాత్రమే కాదనీ, సమాజ భవిష్యత్తుకు పెనుముప్పుగా పరిణమించిన ఒక సామాజిక రుగ్మత అని పేర్కొన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.