బీజేపీ ముక్త దక్షిణ భారత్!

Publish Date:May 14, 2023

Advertisement

కాంగ్రెస్ ముక్త భారత్.. ఇది గత తొమ్మిదేళ్లుగా బీజేపీ నినాదం. కాంగ్రెస్ బలహీనతల కారణంగా అత్యథిక రాష్ట్రాలలో ఆ పార్టీ అధికారంలో లేకపోయి ఉండొచ్చు. కానీ కాంగ్రెస్ పుంజుకుంటుందన్న భావన ఆ పార్టీలోనే కాదు.. జనంలోనూ ఉంది. ఇతర రాజకీయ పార్టీలలోనూ ఉంది. అందుకే బీజేపీ వ్యతిరేక కూటమి ప్రస్తానవ గత నాలుగేళ్లలో ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ కేంద్రంగానే చర్చలు జరుగుతున్నాయి.

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తరువాత దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ లో జోష్ పెరిగింది. ఆ పార్టీలో అంతర్గత కుమ్ములాటలతో జనం ఒకింత నిరాశ చెందుతున్నారన్న మాట కూడా వాస్తవమే. కానీ కాంగ్రెస్ కొట్టింది. కొడితే ఏనుగు కుంభ స్థలాన్ని కొట్టాలన్నట్లుగా సరిగ్గా సార్వత్రిక ఎన్నికలకు ముందు.. అలాగే అంతకంటే ముందు మరికొన్ని కీలక రాష్ట్రాలలో ఎన్నికలు జరగడానికి ముందు, ఆ ఎన్నికలన్నిటికీ లిట్మస్ టెస్ట్ లా పరిశీలకులే కాదు.. పార్టీలూ బలంగా విశ్వసిస్తున్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ తిరుగులేని విజయాన్ని అందుకుని బీజేపీని కంగు తినిపించింది. కాంగ్రెస్ ముక్త భారత్ సంగతి ఏమిటో కానీ, బీజేపీ ముక్త దక్షిణ భారత్ అని కాంగ్రెస్ డంకా భజాయించి మరీ చెప్పింది.  సర్వేలే హంగ్ అన్నాయి, స్వల్ప అధిక్యత అన్నాయి. జనం నాడిని పట్టుకున్నా.. ఆది ఉన్నదున్నట్లు వెల్లడించలేని బలహీనత కారణంగా కొన్ని మీడియా సంస్థలు బీజేపీదే కర్నాటకలో మరోసారి అధికారం అనీ చెప్పేశాయి.

ఫలితాలు బీజేపీకి దిమ్మతిరిగేలా వచ్చాయి. స్వల్ప ఆధిక్యత కాదు. మ్యాజిక్ ఫిగర్ కంటే 22 స్థానాలు అధికంగా వచ్చాయి. సీఎం ఎవరన్న విషయంలో కాంగ్రెస్ మల్లగుల్లాలు పడితే పడుతూ ఉండొచ్చు. విజయం తరువాత కూడా విభేదాలు మరచి ఆ పార్టీ కర్నాటక నేతలంతా ఏకతాటిపై నిలబడి ఇచ్చిన ప్రకటనలు కాంగ్రెస్ లో కొత్త సంప్రదాయానికి తెరతీసినట్లే కనిపిస్తోంది. సరే అది పక్కన పెడితే.. బీజేపీకి ఈ పరాజయం కేవలం పరాజయం కాదు. మసకబారిన  మోడీ ప్రతిష్టకు, ఆ పార్టీ ఇంతకాలం నమ్ముకున్న హిందుత్వ అజెండాను ప్రజలు నిర్ద్వంద్వంగా తిరస్కరించారనడానికీ కూడా నిదర్శనం. తన హోదా, పదవి, పరిధి కూడా మరచి మోడీ ప్రచారంలో జై బజరంగ్ బలి నినాదం చేయడం, సున్నిత అంశాలను ప్రస్తావించి ప్రజల మనోభావాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నించడం, చివరాఖరికి ది కేరళ స్టోరీ సినిమాను ప్రమోట్ చేసి ప్రజల దృష్టిని సమస్యల నుంచి మళ్లించడానికి ప్రయత్నించడం ఇవేమీ కూడా బీజేపీ పట్ల వ్యతిరేకతను ఇసుమంతైనా తగ్గించలేకపోయాయి.  ఇక కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ పరాజయం..

తేలికగా కొట్టిపారేయడానికి లేదు. ఎందుకంటే.. ఆ రాష్ట్రం బీజేపీ, ఆర్ఎస్ఎస్ లకు మార్గదర్శిగా అందరూ చెప్పుకునే బీఎల్ సంతోష్ జీ సొంత రాష్ట్రం. కాంగ్రెస్ ముక్త భారత్ నినాదాన్ని వాస్తవం చేయడానికి దేశంలోని రాష్ట్రాలలో బీజేపీ విజయానికి రూట్ మ్యాప్ లిఖించారని చెప్పబడుతున్న బీఎల్ సంతోష్ జీ సొంత రాష్ట్రం, అలాగే ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో విజయం కోసం పార్టీ తన చతురంగ బలాలనూ దించింది. బీజేపీ జాతీయ నాయత్వమంతా కర్నాటకలో మోహరించి ఊరూ వాడా ఏకమయ్యేలా ప్రచారం చేసింది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ ఒక రోజు తక్కువ వారం రోజులు ఆ రాష్ట్రంలో సుడి గాలి పర్యటనలు చేశారు. రెండు పదులకు పైగా సభలలో ప్రసంగించారు. తన వాక్చాతుర్యమంతా ప్రదర్శించి మరీ కాంగ్రెస్ అవినీతిని ఎత్తి చూపారు.   ఫలితం లేకపోయింది.

చివరకు ఆఖరి క్షణంలో వారు నమ్ముకున్న భజరంగ్ దళ్ వివాదం కూడా వారికి ఓటమి నుంచి బయటపడేయలేకపోయింది.  బీజేపీ పాలనలోని 40 శాతం అవినీతిని నిలువెత్తు లోతులో పారేసి గురివింద సామెతను బీజేపీకి గుర్తు చేశారు.  ఎప్పుడూ సొంతగా గెలవకుండా.. రెండుసార్లు కాంగ్రెస్‌-జెడీఎస్‌ పార్టీల నుంచి తెచ్చుకున్న ఎమ్మెల్యేలతో, నిలబెట్టుకున్న బీజేపీ అధికార సామ్రాజ్యం, ప్రజావ్యతిరేక పవనాలకు ఎగిరిపోయింది.   
 

By
en-us Political News

  
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. 
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది.  సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును  దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి  కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది.  ఈ నేపథ్యంలో తాను కేవలం  మంత్రి పదవిని  మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.