విశాఖ పరిణామాలపై చంద్రబాబు ఆరా.. పవన్ కు ఫోన్

Publish Date:Oct 17, 2022

Advertisement

విశాఖలో గత రెండు రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరా తీశారు. పవన్ కల్యాణ్ బస చేసిన నోవాటెల్ హోటల్ వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించడం, ఆ హోటల్ లో బస చేసిన జనసేన నేతలను అరెస్టు చేయడం, పవన్ కల్యాణ్ కు పోలీసులు నోటీసులు ఇవ్వడం తదితర అశాలపై చంద్రబాబు స్వయంగా పవన్ కల్యాణ్ కు పోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

జనసేన నేతలకు, కార్యకర్తలపై కేసులు, అరెస్టులను ఖండించారు. ఈ సందర్భంగా చంద్రబాబు జగన్ సర్కార్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ సర్కార్ ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కి విపక్షాల గొంతు నొక్కాలని ప్రయత్నిస్తున్నదని విమర్శించారు.  పవన్ కు నోటీసులు ఇవ్వడాన్ని ఖండించారు.  పవన్ కల్యాణ్ పర్యటనపై ఆంక్షలను వెంటనే తొలగించాలని  చంద్రబాబు డిమాండ్ చేశారు. విశాఖపట్నంలో శనివారం వైకాపా నేతృత్వంలో జరిగిన విశాఖ గర్జన్ కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే.

కాగా అదే రోజు జనసేనాని పవన్ కల్యాణ విశాఖ రావడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. విశాఖ విమానాశ్రయంలో పవన్ కల్యాణ్ వచ్చిన సమయంలోనే విశాఖ గర్జన ముగించుకుని మంత్రులు విశాఖ విమానాశ్రయానికి చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. కొందరు మంత్రుల వాహనాలపై దాడికి పాల్పడ్డారు. జనసేన శ్రేణులు మంత్రులపై దాడులకు పాల్పడ్డారంటూ  వైసీపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు జనసేన నేతలను, కార్యకర్తలను అరెస్టు చేశారు. ఆదివారం  పోలీసులు పవన్ కు నోటీసులు ఇచ్చి  విశాఖను వీడాలంటూ స్పష్టం చేశారు.
 
ఈ పరిణామాల నేపథ్యంలోనే  చంద్రబాబు పవన్ కల్యాణ్ కు ఫోన్ చేసి  పవన్ తో మాట్లాడారు. వందలాది మంది జనసేన నేతలపై కేసులు పెట్టడాన్ని చంద్రబాబు తప్పుబట్టారు. ఓ పార్టీ అధ్యక్షుడికి ప్రజల సమస్యలు తెలుసుకునే హక్కు ఉంటుందన్న చంద్రబాబు,  జనసేన జనవాణి కార్యక్రమాన్ని సమర్థించారు ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ విశాఖలో పరిస్థితులపైని,  తనకు పోలీసులు నోటీసులు ఇవ్వడం, తమ నేతలను అరెస్టు చేయడం తదితర అంశాలను చంద్రబాబుకు వివరించారు.

రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందనీ, జగన్ సర్కార్ పోలీసు అండతో విపక్షాల గొంతు నొక్కాలని ప్రయత్నిస్తోందనీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.  ప్రతిపక్ష నేతల కార్యక్రమాలకు అడ్డంకులు సృష్టించడం సరికాదన్నారు. విపక్ష నేతలను దూషించడమే లక్ష్యంగా వైసీపీ పనిచేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు.   ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నారని పవన్ తో అన్నారు చంద్రబాబు.

By
en-us Political News

  
జగన్‌లో మార్పు వుంటుందా, వుండదా అన్న అయోమయంలో వైసీపీ నేతలు.. ఆయనలో మార్పు వుండదన్న నిశ్చయానికి వచ్చేస్తున్నారు.
రాజకీయాల్లో విజయం అనేది కేవలం నాయకుల ఉపన్యాసాల వల్ల మాత్రమే సాధ్యం కాదు. అధికారం, రాజకీయ వేధింపులు, ఆంక్షలు ఎన్ని ఎదురైనా వెరవక
అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పరిధిలో దాదాపు రూ. 7.5 కోట్ల విరాళాల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలపై పార్లమెంట్‌ ద్వారం వద్ద స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ కాషాయ వస్త్రాలు ధరించి, పూజారి వేషంలో ఒక పెద్ద హుండీతో కూర్చుని సేకరించిన విరాళాలను జేబులో వేసుకుంటూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు.
నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే విశాఖను గ్లోబల్ ఐటీ, ఇండస్ట్రియల్ హబ్‌గా మార్చాలనే ఆలోచనతో ఈ భోగాపురం ప్రాజెక్టుకు చంద్రబాబు బీజం వేశారనీ, అయితే.. కాలక్రమంలో ప్రభుత్వాలు మారాయి, ప్రాజెక్టు ప్రతిపాదనలు మడతపడ్డాయన్నారు.
సిదిరి అప్పలరాజు కుమారుడు బైక్ నిర్లక్ష్యంగా నడిపి ఒకరి మృతికి కారణమయ్యారన్న కేసు దర్యాప్తులో వెలుగు చూసిన అంశాల మేరకు ఇందులో ఎలాంటి రాజకీయ కుట్రలు లేవు. సీదిరి అప్పలరాజు చేసిన అతే.. ఆయనను చట్టపరంగా ఇబ్బందుల్లోకి నెట్టింది.
ఎప్పుడో ఓ సారి జైల్లో ఉన్న నేతకు పరామర్శ పేరుతో బయటకు వచ్చే సందర్భాలలో కూడా సదరు నేతను పరామర్శించడం కంటే.. బల ప్రదర్శనకు, తనకు జనం మద్దతు ఉందని నిరూపించుకునే ప్రదర్శనలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయన అలా బయటకు వచ్చిన ప్రతి సారీ అభాసుపాలౌతూనే ఉన్నారు.
ఢిల్లీ వీధుల్లో రగిలిన ఆగ్రహ జ్వాలలు, పోలీసుల లాఠీఛార్జీలు, కన్నీటి ధారలు, నిర్బంధాలను సైతం లెక్కచేయక హక్కుల కోసం వీధిపోరాటానికి దిగిన యువత ఆక్రందనలు
రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ అమూల్యమైన భూములను ఇవ్వద్దు, భోగాపురం విమానాశ్రయాన్ని అందరం కలిసి అడ్డుకుందాం" అంటూ జగన్ ఇచ్చిన పిలుపుల ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతూ భోగాపురం విషయంలో జగన్ ద్వంద్వ వైఖరిని ఎండగడుతున్నాయి.
తెలుగుదేశం కూమిటికి ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. చంద్రబాబు నాయకత్వంలో కూటమి సర్కార్ సంక్షేమ, అభివృద్ధిని సమాంతరంగా పరుగులు పెట్టిస్తున్నప్పటికీ ఆ స్థాయిలో ప్రజాదరణ పెరగడం అటుంచి.. క్షేత్రస్థాయిలో కూటమి పాలన పట్ల ఒకింత అసంతృప్తి పె రిగిందని సర్వే స్పష్టం చేయడమే.
మొత్తంగా విద్యార్థులు, యువతఉద్యమం.. ఒక స్పష్టమైన సందేశాన్ని అయితేనిస్సందేహంగా ఇచ్చింది. అన్యాయాన్ని ప్రశ్నించడంలో, హక్కుల కోసం పోరాడటంలో , న్యాయం కోసం నినదించడంలో వెనకడుగు వేసే ప్రశ్నేలేదని చాటింది.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కర్నూలు జిల్లా ఆదోని పట్టణ, మండల టీడీపీ నేతలు పని చేయాలని
నీట్ పేపర్ లీక్ ఆందోళనలతో దిల్లీ వీధులను ఊపేసిన బొద్దింకలు ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద రైతు నాయకుడు రాకేష్ తికాయత్‌ను కలిసి సంఘీభావం ప్రకటించాయి.
మాజీ మంత్రి జోగి రమేష్ తనపై చేస్తున్న ఆరోపణలనుఖండించిన వసంత వెంకట కృష్ణ ప్రసాద్.. జోగి రమేష్ కు ఎటువంటి క్రెడిబులిటీ లేదనీ, అతను ఏదోదో మాట్లాడతారనీ, అవన్నీ పట్టించుకోవలసిన అవసరం లేదని చెప్పారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.