దక్షిణాఫ్రికా 255/2 : రాణించిన కల్లిస్, ఆమ్లా

Publish Date:Nov 9, 2012

Advertisement

 

ఆస్ట్రేలియాతో తోలి టెస్ట్ ను దక్షిణాఫ్రికా ఘనంగా ప్రారంభించింది. ఆమ్లా 90 బ్యాటింగ్, కలిస్ 84 బ్యాటింగ్ తో రాణించడంతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సఫారీలు తొలి రోజు ఆట ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 255 పరుగులు చేశారు.


ఆసీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న ఆమ్లా రెండు కీలక భాగస్వామ్యాలు జోడించాడు. పచ్చిక వికెట్ మీద స్వింగ్, పేస్‌లతో చెలరేగుతారనుకున్న కంగారులు అతనిపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. రెండో వికెట్‌కు పీటర్సన్‌తో కలిసి 90, కలిస్‌తో కలిసి మూడో వికెట్‌కు అజేయంగా 136 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలోనే టెస్టుల్లో 5 వేల పరుగుల మైలురాయిని కూడా అధిగమించాడు.



62 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఇచ్చిన క్యాచ్‌ను అటు వికెట్ కీపర్, ఇటు ఫస్ట్ స్లిప్ లియోన్ అందుకోలేకపోయారు. కలిస్ కూడా 42 పరుగుల వద్ద అవుటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. సిడిల్ వేసిన బంతి టీవీ రిప్లేలో నోబాల్‌గా తేలింది. ఆసీస్ బౌలర్లలో ప్యాటిన్సన్, లియోన్ చెరో వికెట్ తీశారు.

 

By
en-us Political News

  
 మహిళకు ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన..
ముంబయిలో పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు..
రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మరోసారి తీవ్ర కలకలం రేగింది.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.
టీడీపీ సోషల్ మీడియాలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని అనుకరిస్తూ వీడియోలు చేసి గుర్తింపు పొందిన ఆర్టిస్ట్ సునీల్ తాజాగా క్షమాపణలు చెప్పారు.
ఉత్తరప్రదేశ్‌లో అత్యంత ఘోరమైన, కలకలం రేపే ఘటన వెలుగుచూసింది. ఓ మహిళ దాహం వేసి నీళ్ల బాటిల్ అనుకుని యాసిడ్ తాగడంతో తీవ్ర అనారోగ్యానికి గురైంది.
భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన మధుర గానంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న గానకోకిల ఎస్. జానకి
వియత్నాంలో జరిగిన పడవ ప్రమాదంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బాధితులకు అందుతున్న సహాయ చర్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష
రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకున్నట్లు సమాచారం.
భారతీయ సినీ సంగీత ప్రపంచంలో గానకోకిలగా, నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియాగా చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రముఖ గాయని ఎస్. జానకి. ఆమె తన మధురమైన గానంతో కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో ఆదివారం ఉదయం ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో తమిళ సినీ నటుడు ఆర్యపై చీటింగ్ కేసు నమోదైంది.
రంగారెడ్డి జిల్లాలో ఒక బాధ్యతాయుతమైన పోలీసు అధికారి ప్రవర్తించిన తీరు ఇప్పుడు స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.