రోడ్ల నాణ్యత.. దేశంలోనే ఏపీ నంబర్ 2.!

Publish Date:Jul 10, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల నాణ్యత దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. జగన్ హయాంలో ఐదేళ్ల పాటు.. ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల దుస్థితిపై దేశ వ్యాప్తంగా సెటైర్లు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా పొరుగు రాష్ట్రంలో అప్పట్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేతలు.. ఆంధ్రప్రదేశ్ రోడ్ల పరిస్థితిని ఎత్తి చూపుతూ తెలంగాణ అభివృద్ధి గురించి గొప్పగా చెప్పుకునే వారు. ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు అంటే గుంతలేనని ఎద్దేవా చేసేవారు. ఆ రహదారులపై ప్రయాణించలేక జనం అవస్థలు పడేవారు. గుంతల మయమైన రోడ్ల కారణంగా ప్రమాదాలకు గురై పెద్ద సంఖ్యలో మరణాలు కూడా సంభవించాయి. అయితే అదంతా గతం. 

రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు మరీ ముఖ్యంగా   గ్రామీణ రోడ్ల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. దీంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన రెండేళ్లలోనే రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అనూహ్యంగా మెరుగుపడింది. ఏపీలో రోడ్ల నాణ్యత ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది.  కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన (పీఎంజీఎస్ వై) జాతీయ తనిఖీ నివేదికల ప్రకారం, గ్రామీణ రోడ్ల నాణ్యతలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది.

గతంలో..  అంటే 2021-22 ఆర్థిక సంవత్సరంలో రోడ్ల నాణ్యతలో దేశంలో దారుణంగా 19వ ర్యాంకులో ఉన్న ఆంధ్రప్రదేశ్ తాజా నివేదిక ప్రకారం   2వ స్థానానికి ఎగబాకి  కొత్త రికార్డు సృష్టించింది. కేవలం రెండేళ్ల వ్యవధిలోనే 19వ స్థానం నుండి రెండో స్థానానికి చేరడం ఒక అద్భుత విజయంగా.. పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పీఎంజీఎస్‌వై నేషనల్ క్వాలిటీ మానిటరింగ్ విభాగం ఏప్రిల్ 2025 నుండి మార్చి 2026 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా పూర్తయిన రోడ్డు పనులపై సమగ్ర మూల్యాంకనం నిర్వహించి ఈ ర్యాంకులను ప్రకటించింది. ఈ జాబితాలో గుజరాత్ మొదటి స్థానంలో నిలవగా, ఆంధ్రప్రదేశ్ రెండో స్థానాన్ని దక్కించుకుంది

జాతీయ స్థాయిలో మొత్తం 2 వేల 948 రోడ్లను కేంద్ర బృందాలు   తనిఖీ చేయగా, అందులో 441 రోడ్లు నాణ్యతా ప్రమాణాల కంటే తక్కువగా ఉన్నట్లు తేలింది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, రాష్ట్రవ్యాప్తంగా తనిఖీ చేసిన 126 ప్రధాన గ్రామీణ రహదారుల్లో కేవలం ఒక్కటంటే ఒక్క రోడ్డు మాత్రమే ప్రమాణాల కంటే తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన నూటపాతిక రోడ్లూ కూడా,  అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో నిర్మితమయ్యాయని కేంద్ర నివేదిక పేర్కొంది. 

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్,  గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తీసుకున్న   నిర్ణయాలు, పటిష్టమైన నిఘా వ్యవస్థే రోడ్ల నాణ్యత విషయంలో ఏపీ ఈ ఘనత సాధించడానికి కారణమని చెప్పవచ్చు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన క్షణం నుంచే..  పవన్ కళ్యాణ్ గ్రామీణ రహదారుల పునర్నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించారు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యానికి తావులేకుండా, నిధులు దుర్వినియోగం కాకుండా కఠిన నిబంధనలను అమలు చేశారు. సోషల్ మీడియా వేదికల ద్వారా మారుమూల గ్రామాల ప్రజలు తమ ప్రాంతాల్లోని   రోడ్ల పరిస్థితి గురించి  ఫిర్యాదు చేసిన ప్రతి సందర్భంలోనూ  పంచాయతీరాజ్ శాఖ తక్షణమే స్పందించి యుద్ధప్రాతిపదికన నిధులు మంజూరు చేస్తూ మరమ్మతులు చేపట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యవేక్షణ సమన్వయంతో సాగడం వల్లే ఏపీ రోడ్ల వ్యవస్థలో ఈ మార్పు సాధ్యమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

Pawan Kalyan, Andhra Pradesh News, PMGSY National Rankings, Rural Road Development, AP Panchayat Raj

By
en-us Political News

  
కృష్ణాష్టమి 2026 సందర్భంగా భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన మథుర, బృందావనం, ద్వారక, గురువాయూర్ మరియు పూరీ జగన్నాథ ఆలయాల విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇక్కడ తెలుసుకోండి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026 అక్టోబర్ 12 నుండి 21 వరకు జరగనున్నాయి. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం మరియు వాహన సేవల సంపూర్ణ షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి.
అయోధ్య శ్రీ రామ్ జన్మభూమి మందిర్ సీఈఓ ఎంపిక కోసం ప్రతిపాదించిన ముగ్గురి పేర్ల జాబితాను కమిటీ ఈరోజు ట్రస్ట్‌కు సమర్పించనుంది. తిరుమల తరహాలో ఆలయ నిర్వహణ కోసం తీసుకున్న ఈ కీలక నిర్ణయ వివరాలు ఇక్కడ చదవండి.
పాకిస్థాన్‌లోని నారోవాల్‌లో 125 ఏళ్ల నాటి చారిత్రక హిందూ దేవాలయాన్ని రాత్రికి రాత్రే కూల్చివేశారు. ఈ ఘోరంపై స్థానిక హిందూ సంఘాల ఆగ్రహం, ఆందోళనల వివరాలు ఇక్కడ చదవండి.
టీటీడీ వేదపారాయణదారుల ఎంపిక ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారింది. తెలంగాణ అభ్యర్థులకు స్థానికత అడ్డంకిగా మారడం, అర్హత మార్కులను 85 నుండి 40కి తగ్గించడంపై వేదపండితులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నియామకాల వెనుక ఉన్న పూర్తి వివరాలు, వివాద కారణాలు ఇక్కడ చూడండి.
2026 ఆగస్టు 29 రాశి ఫలాలు, టారో కార్డుల విశ్లేషణ మరియు వాస్తు చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి. మేషం నుండి మీనం వరకు ద్వాదశ రాశుల ఉద్యోగం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి మరియు సరైన వాస్తు నివారణల సమగ్ర వివరాలు!
పశ్చిమ బెంగాల్ దుర్గాపూజ పండళ్ల లోపల మాంసాహారం నిషేధించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. 5 రోజుల ఉత్సవాల్లో సనాతన సంప్రదాయాలు పాటించాలని 600 పూజా కమిటీలకు వీహెచ్‌పీ చేసిన ప్రతిపాదనల వివరాలు.
రక్షాబంధన్ రోజున రాఖీ దారం తెగిపోవడం అశుభమా కాదా అనే సందేహాలకు వేద పండితుల సమాధానం తెలుసుకోండి. తెగిపోయిన రాఖీ వల్ల కలిగే ప్రయోజనాలు, పాటించాల్సిన నియమాలు మరియు 2026 రాఖీ శుభ ముహూర్తాల వివరాలు.
తిరుమలలో పౌర్ణమి మరియు గరుడ సేవ సందర్భంగా భక్తులు పోటెత్తారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుండగా, ఒక్కరోజే 66,437 మంది దర్శించుకోగా రూ. 4.45 కోట్ల హుండీ ఆదాయం లభించింది.
తిరుపతి ఫారెస్ట్ డివిజన్ అధికారులు అత్యంత అరుదైన 3 రోజ్-రింగ్డ్ ప్యారాకీట్స్ (రామచిలుకలను) సమర్థవంతంగా రక్షించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వాటిని తిరిగి అడవిలోకి విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి వివరాలు చదవండి.
శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే హయగ్రీవ జయంతి విశిష్టత, శ్రీమహావిష్ణువు హయగ్రీవ అవతారం ఎత్తడానికి గల ఆధ్యాత్మిక కథ మరియు విద్యార్థులకు జ్ఞానాన్ని ప్రసాదించే హయగ్రీవ పూజా విధానం గురించి వివరంగా తెలుసుకోండి.
చంద్ర గ్రహణ సమయంలో ఆధ్యాత్మిక రక్షణ మరియు మానసిక ప్రశాంతత పొందేందుకు పాటించాల్సిన సూతక కాల నియమాలు, మంత్ర జపం, గర్భవతుల జాగ్రత్తలు మరియు గ్రహణానంతర శుద్ధి, దానాల విశిష్టతలను వివరంగా తెలుసుకోండి.
2026 రక్షాబంధన్ సందర్భంగా సోదరుడి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం మరియు దీర్ఘాయువు కోసం సోదరీమణులు చేయాల్సిన పవిత్ర దానాల విశిష్టతలను తెలుసుకోండి. ఆహార ధాన్యాలు, బెల్లం, వస్త్రాలు మరియు నల్ల నువ్వుల దానం వల్ల కలిగే ఆధ్యాత్మిక, జ్యోతిష్య ప్రయోజనాలు ఇవే!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.