Publish Date:Apr 14, 2026
సిద్దిపేట అర్బన్ మండలం తడ్కపల్లి గ్రామంలో డాక్టర్ బాబాసాహేబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. తడ్కపల్లి గ్రామంలో ఎన్నో ఏళ్లుగా ఉన్న లోటు నేటితో తీరిందని, గ్రామ ప్రవేశంలోనే అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. గ్రామానికి వచ్చే ప్రతి ఒక్కరిని ముందుగా ఆహ్వానించేది అంబేద్కర్ అవుతారని వ్యాఖ్యానించారు. ఇచ్చిన మాట ప్రకారం సాయి , ఆయన కుమారుడు విగ్రహం ఏర్పాటు చేయడంపై వారిని అభినందించారు.
అంబేద్కర్ కేవలం ఒక వర్గానికి మాత్రమే నాయకుడు కాదని, ఆయన అందరికీ చెందిన మహానుభావుడని హరీష్ రావు స్పష్టం చేశారు. భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఎదగడానికి అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే ప్రధాన కారణమని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం అనంతరం ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడం ఆయన గొప్పతనమని తెలిపారు.పేదరికం చదువుకు అడ్డంకి కాదని అంబేద్కర్ జీవితాన్ని చూసి యువత నేర్చుకోవాలని సూచించారు. విదేశాల్లో స్థిరపడే అవకాశాలు ఉన్నప్పటికీ, దేశంలోని అణగారిన వర్గాల కోసం పోరాడి విజయం సాధించిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు వాగ్దానం చేసిన ఆర్థిక సహాయం అందించలేదని, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఆలస్యం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.అదేవిధంగా, మాజీ సీఎం కేసీఆర్ కాలంలో విద్యార్థులకు విదేశీ విద్య కోసం ఆర్థిక సహాయం అందించారని గుర్తు చేశారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డిపై కూడా హరీష్ రావు విమర్శలు చేస్తూ, అంబేద్కర్ పట్ల గౌరవం చూపడం లేదని ఆరోపించారు. దళిత బంధు పథకాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. యువతకు హరీష్ రావు పలు సూచనలు చేశారు. ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ మరియు మత్తు పదార్థాలకు బానిసలుకాకుండా జాగ్రత్తపడాలని సూచించారు. అంబేద్కర్ చూపించిన మార్గంలో నడుస్తూ ఉన్నత విద్యను సాధించాలని పిలుపునిచ్చారు.“వ్యసనాలకు అలవాటు అయితే జీవితాలు నాశనం అవుతాయి. ఆన్‌లైన్ గేమ్స్ ఆడి లక్షల రూపాయలు కోల్పోవద్దు. తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేయొద్దు” అంటూ యువతకు హరీష్ రావు సూచించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/-ambedkar-jayanti-at-tadkapalli-village-36-217337.html
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పట్టణంలో పురాతన రామాలయ పునర్నిర్మాణ పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కుమార్తె జనని నిశ్చితార్థ వేడుక ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.
కరీంనగర్ నగరంలో ఆదివారం మధ్యాహ్నం సంచలనాత్మక దోపిడీ ఘటన చోటుచేసుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలో పెను విషాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.
ఎస్.కె.జిలానీ తన కుమారుడు ఫైసల్‌తో కలిసి బైక్‌పై ఎల్బీ నగర్ వైపు వెళ్తుండగా.. . గాయత్రినగర్ వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ కారు వీరి వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఫైసల్‌కు గాయాలయ్యాయి. కారు డ్రైవర్‌ను నిలదీసేందుకు జిలానీ కారుకు అడ్డంగా వెళ్లారు. అయితే డ్రైవర్ కారు ఆపకుండా ముందుకు పోనివ్వడంతో జిలానీ కారు బానెట్‌పై పడి దాన్ని గట్టిగా పట్టుకున్నారు.
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్‌కు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై బ్యాటర్లలో నమన్ ధిర్ 57 పరుగులతో రాణించాడు. మిగిలిన వారు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ముఖ్యంగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా 23 బంతుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే చేసి నెమ్మదిగా ఆడటం జట్టు స్కోరుపై ప్రభావం చూపింది.
వియత్నాం యుద్ధం తర్వాత అమెరికాలో ఏర్పడిన అసంతృప్తి కారణంగా 1973లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అప్పట్లో అధ్యక్షుడు కాంగ్రెస్‌ను పక్కనబెట్టి ఏక పక్షంగా యుద్ధాన్ని కొనసాగించడం ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తింది. అందుకే భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు రాకుండా నియంత్రణలు అవసరమని భావించి ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు.
అసలే నష్టాల్లో కూరుకుపోయిన స్పిరిట్ ఎయిర్‌లైన్స్ యుద్దం కారణంగా ఇంధన ధరలు రెట్టింపు అవ్వడంతో.. ఇక సర్వీసులు నడపలేమని చేతులెత్తేసింది. త్వరలో అన్ని కార్యకలాపాలకూ ఫుల్ స్టాప్ పెడతామని ప్రకటించింది. తమ ప్రయాణికులు ఎయిర్‌పోర్టులకు వెళ్లవద్దని సూచించింది
నారాయణ్‌పూర్ జిల్లాకు ఆనుకుని ఉన్న ఛోటేబేతియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌ని మార్చి 31న సాయుధ మావోయిస్టులు లేని రాష్ట్రంగా ప్రకటించారు. సాయుధ మావోలు లేని రాష్ట్రంగా ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో జరిగిన తొలి పేలుడు ఇదే కావడం గమనార్హం.
సీఎం చంద్రబాబుకు పవన్ కల్యాణ్, ఆయన భార్య అనా కొణిదెల సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పవన్ ఆరోగ్య పరిస్థితిని చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.
లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారంలో సూత్రధారిగా ఏకసభ్య కమిషన్ తేల్చిన ఈవో ధర్మారెడ్డి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు.
గత కొద్ది కాలంగా మంత్రి లోకేష్ నేతృత్వంలో విద్యాశాఖ పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. కొద్దిరోజుల క్రితమే ఏపీ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థుల బృందం ఢిల్లీ పర్యటనకు వెళ్లి.. అక్కడి సైన్స్ సెంటర్లు, ప్రముఖ విద్యా సంస్థలను సందర్శించి వచ్చిన సంగతి తెలిసిందే. పుస్తకాల్లోని జ్ఞానానికి తోడుగా విద్యార్థులకు వాస్తవిక ప్రపంచంపై అవగాహన కల్పించేందుకు ఆ యాత్ర ఎంతో దోహదపడింది. ఇప్పుడు ఉపాధ్యాయులను కూడా విదేశాలకు పంపడం ద్వారా అటు విద్యార్థులకు, ఇటు ఉపాధ్యాయులకు ఇద్దరికీ సమానమైన ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది.