పది ప్రమాదాలు.. వందల ప్రాణాలు !

Publish Date:Jun 12, 2025

Advertisement

విమానం ఎక్కాలంటేనే కాదు, దిగాలన్నా అదృష్టం ఉండాలి... ఇది ఏదో సినిమాలో డైలాగు. ఈ రోజు అది నిజమని మరో మారు రుజువైంది. అహ్మదాబాద్‌ విమానశ్రయం నుంచి ఇంగ్లాండ్ వెళ్లేందుకు బయలుదీరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం నిముషాల వ్యవధిలో ఒక్క సారిగా కూలిపోయింది. సమీపంలోని మెడికల్ కాలేజీ హాస్టల్ భవనం పై కూలి పోయింది. కూలిన విమానంలో, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్  రూపాలీ సహా 242 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బంది ఉన్నారు.అందులో ఎందరు ఉన్నారో .. అసలు ఎవరైనా ఉన్నారో లేరో కూడా తెలియదు.ఇది, మన దేశం దేశంలో జరిగిన అత్యంత దయనీయ విమాన ప్రమాదంగా పేర్కొంటున్నారు.అయితే, ఇదే మొదటి విమాన ప్రమాదం కాదు, ఇంతకు ముందు కూడా అనేక విమాన  ప్రమాదాలు జరిగాయి.. వందల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.. అలాంటి పది ప్రమాదాల వివరాలు..ఇలా ఉన్నాయి.  

 

1.    ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్

7 ఆగస్టు, 2020: కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయం ల్యాండింగ్ సమయంలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం రన్‌వేను దాటి వెళ్లింది. ఈ ప్రమాదంలో 18 మంది మరణించగా, 172 మంది సజీవంగా బయటపడ్డారు.ఈ ఘటన కేరళలోని కోజికోడ్‌లో జరిగింది. ఇది ఇటీవలి సంవత్సరాలలో జరిగిన ముఖ్యమైన ప్రమాదాలలో ఒకటిగా నిలిచింది.

2.    దుబాయ్-మంగళూరు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్

22 మే, 2010: మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో కూడా ల్యాండింగ్ సమయంలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం రన్‌వేను దాటి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 158 మంది మరణించారు. కేవలం 8 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.

3.    అలయన్స్ ఎయిర్ ఫ్లైట్ 7412

17 జూలై, 2000: పాట్నాలోని ఒక రెసిడెన్షియల్ ఏరియాలో అలయన్స్ ఎయిర్ ఫ్లైట్ 7412 అనుకోకుండా కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 55 మందితో పాటు భూమిపై ఉన్న ఐదుగురు మరణించారు. ఈ ఘటన బీహార్‌లో జరిగిన తీవ్రమైన విమాన ప్రమాదాలలో ఒకటి.

4.    చర్ఖీ దాద్రీ మిడ్-ఎయిర్ ఘర్షణ

12 నవంబర్, 1996: సౌదీ అరేబియన్ ఎయిర్‌లైన్స్, కజకిస్తాన్ ఎయిర్‌లైన్స్ విమానాలు చర్ఖీ దాద్రీ వద్ద గాలిలో ఢీకొన్నాయి. ఈ ఘటనలో రెండు విమానాలలోని 349 మంది ప్రయాణికులు మరణించారు. ఇది భారతదేశంలో జరిగిన అత్యంత ఘోరమైన విమాన ప్రమాదాలలో ఒకటిగా గుర్తించబడింది.

 

5.    ఔరంగాబాద్ ఇండియన్ ఎయిర్‌లైన్స్

26 ఏప్రిల్, 1993: ఔరంగాబాద్‌లో టేకాఫ్ సమయంలో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం ఒక ట్రక్కును ఢీకొంది. ఈ ప్రమాదంలో 55 మంది మరణించగా, 66 మంది గాయపడ్డారు. మహారాష్ట్రలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర ప్రభావం చూపింది.

6.    ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఇంఫాల్

16 ఆగస్టు, 1991: ఇంఫాల్‌కు దిగుతున్న సమయంలో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో 69 మంది మరణించారు. మణిపూర్‌లో జరిగిన ఈ ఘటన ఆ రాష్ట్రంలోని విమాన భద్రతపై చర్చలను రేకెత్తించింది.

 

7.    ఇండియన్ ఎయిర్‌లైన్స్ బెంగళూరు

14 ఫిబ్రవరి, 1990: బెంగళూరు విమానాశ్రయంలో కూడా ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం ఇది వరకు కుప్పకూలింది. ఈ ఘటనలో 92 మంది మరణించారు. కర్ణాటకలో జరిగిన ఈ ప్రమాదం ఆ రోజుల్లో విమాన భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలను లేవనెత్తింది.

8.    ఇండియన్ ఎయిర్‌లైన్స్ అహ్మదాబాద్

19 అక్టోబర్, 1988: అహ్మదాబాద్ విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో 133 మంది మరణించారు. గుజరాత్‌లో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది.

9.    ఎయిర్ ఇండియా బొంబాయి

21 జూన్, 1982: వాతావరణంలో మార్పు కారణంగా బొంబాయిలో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. ఈ ఘటనలో 17 మంది మరణించగా, 94 మంది సజీవంగా బయటపడ్డారు. మహారాష్ట్రలో జరిగిన ఈ ప్రమాదం వాతావరణ సవాళ్లను ఎదుర్కొనే విమాన భద్రతా వ్యవస్థలపై దృష్టిని సారించింది.

10.    ఎయిర్ ఇండియా బాంద్రా

1 జనవరి, 1978: బాంద్రా తీరంలో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. ఈ ఘటనలో 213 మంది మరణించారు. ఈ ప్రమాదం భారతదేశంలో జరిగిన అత్యంత ఘోరమైన విమాన ప్రమాదాలలో ఒకటిగా నిలిచింది. ఈ ప్రమాదాలు భారత విమాన రంగంలో భద్రతా వ్యవస్థలను మెరుగుపరచడానికి అవసరమైన చర్యలను తీసుకోవడంపై దృష్టి సారించాయని చెప్పవచ్చు.

By
en-us Political News

  
రాజకీయ కక్షలను పక్కనపెట్టి, రాష్ట్రాభివృద్ధి, స్థానిక స్వపరిపాలన బలపడే దిశగా అన్ని పార్టీలు అడుగులు వేయాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకమైన ఎన్నికలను నిర్వహించడమే ఏ ప్రభుత్వానికైనా, వ్యవస్థకైనా అసలైన పరీక్షగా నిలుస్తుంది.
గతంలో స్థానిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న దౌర్జన్యాలు, హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించి, నాడు జగన్ హయాంలో అరాచకం ఏ రకంగా స్వేరవిహారం చేసిందో చూపి మరీ ఆ పార్టీ తీరును దుయ్యబట్టారు.  
వందలాది మంది కొత్త వ్యక్తులు వస్తే తనకు  ప్రాణహాని ఉందని, కెమెరాలు, ఫోటోలతో ఇంటి భద్రత బయటపడుతుందని జగన్  షర్మిల కుమార్తె వివాహం ఎలహంక ప్యాలెస్ లో వద్దనడానికి కారణంగా తన లేఖలో పేర్కొన్నారు. అయితే దీనికి వైఎస్ కుటుంబ సభ్యులు, షర్మిల కుటుంబం తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలో   షర్మిల కుటుంబ సభ్యులు జగన్ కు సంధించిన లేఖాస్త్రంలో  వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన కుటుంబ వేడుకలను ప్రస్తావిస్తూ.. జగన్ ను వైఎస్సార్ కంటే గొప్పవాడివా అంటూ నిలదీశారు.
అధికారిక భేటీ ముసుగులో జరిగిన ఈ గోప్యతా ఉల్లంఘన ఉదంతం ఒక్కసారిగా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను పెంచేసింది. ఒక వార్తా ఛానెల్‌కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో డీకే శివకుమార్ ఈ అంశానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ గతంలోనే ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదని జోస్యం చెప్పారు.  అల్లర్లు జరుగుతాయని హెచ్చరికలు జారీ చేశారు. చివరకు ఆయన అన్నట్లుగానే జరిగింది. అల్లర్లకు కారణం ఎవరన్నది పక్కన పెడితే.. వైసీపీ సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ మునిసిపోల్స్ కు రీ షెడ్యూల్ సాధించింది.
అధికారికంగా ఇటు షర్మిల కానీ, అటు జగన్ కానీ వివాహ వేడుక బెంగళూరు ప్యాలెస్ విషయంపై మాట్లాడలేదు. అయితే మీడియా కథనాల ఆధారంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం తగుదునమ్మా అంటూ మీడియా ముందుకు వచ్చి.. జగన్ నివాసం ఉంటున్న బెంగళూరు ప్యాలెస్ ఫంక్షన్ హాలేమీ కాదు.. పెళ్లిళ్లకు వేదికగా ఇవ్వడానికి అంటూ వ్యాఖ్యలు చేశారు. 
 సీజేపీ నిరసన తెలిపేందుకు అనుమతి కోరిన తర్వాత, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ ఆర్డర్ ద్వారా జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశంగా డీనోటిఫై చేయడం నుండి నీట్ పేపర్ లీక్ సమస్యల వరకు అన్నామలై కేంద్రాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశారు.
కాన్వాయ్ భద్రతా సిబ్బంది లేకుండా, ప్రోటోకాల్స్ ను కాదని మరీ సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి చేరుకుని ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ భేటీలో ఇరువురూ, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు  స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగిందని అంటున్నారు.  
పరకాల ప్రభాకర్ మద్దతు కేంద్రానికి ఎందుకు షాక్ గా మారిందంటే.. ఆయన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ భర్త కావడం వల్లనే. . ఈ ఉద్యమానికి ఒక అనూహ్య వ్యక్తి మద్దతు తెలపడంతో దీనికి మరింత బలం చేకూరింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త  పరకాల ప్రభాకర్, అక్టోబర్ 23న జరగనున్న ఈ నిరసనలో పాల్గొంటాననీ, బొద్దింకల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలుపుతాననీ ప్రకటించారు.   
దేశవ్యాప్తంగా లేదా ప్రధాన నగరాల్లో తాము నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి  దీపావళి పండుగ తరువాత నుంచీ ఆందోళనలను పున: ప్రారంభించనున్నట్లు తెలిపారు.
2021లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జగన్ అధికారంలో ఉన్నారు. అప్పట్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నా వైసీపీయులు అడ్డుకున్నారు. ఆ విషయాన్ని విస్మరించి.. ఇప్పుడు జగన్ అధికార కూటమి తమను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.