ఇండియాలో రోడ్డు భద్రత, వాహన రక్షణ వ్యవస్థపై సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. దేశవ్యాప్తంగా చెల్లుబాటు అయ్యే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేదా వాహన బీమా లేని వాహనాలకు పెట్రోల్, డీజిల్విక్రయాలను పూర్తిగా నిరాకరించే ప్రతిపాదనను పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ నియమాన్ని ప్రాథమికంగా నో ఇన్సూరెన్స్, నో ఫ్యూయల్ అనే ప్రత్యేక విధానం రూపంలో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని ఆదేశించింది.
వాహన యజమానులు సామాజిక, చట్టబద్ధమైన బాధ్యతను గుర్తించేలా చేయడం, దురదృష్టవశాత్తు రహదారి ప్రమాదాలు జరిగిన సమయంలో బాధితులకు తగిన ఆర్థిక పరిహారం సకాలంలో అందేలా చూడటమే ఈ ప్రతిపాదిత మార్గదర్శకాల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని పేర్కొంది.
జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ప్రస్తుతం దేశంలోని రహదారులపై తిరుగుతున్న వాహనాల్లో సగానికి పైగా సరైన ఇన్సూరెన్స్ కవరేజ్ లేకుండానే యథేచ్ఛగా ప్రయాణిస్తున్నాయనీ, ఇది దిగ్భ్రాంతికరం, ఆందోళనకరం అని పేర్కొంది. మోటారు వాహనాల చట్టం నిబంధనలకు ఇది పూర్తిగా విరుద్ధమన్న సుప్రీం కోర్టు.. బీమా లేని వాహనాల వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులు, వారి కుటుంబాలు ఆర్థిక నష్టాన్ని, మానసిక క్షోభను అనుభవిస్తున్నారనీ, దేశంలో ఏటా వేలాది మంది రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్న తరుణంలో, ఈసమస్యకు తక్షణమే శాశ్వత పరిష్కారం కనుగొనాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని సుప్రీం కోర్టు పేర్కొంది.
Supreme Court vehicle insurance rule, No insurance no fuel policy, Third party vehicle insurance, Motor Vehicles Act compliance
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/--supreme-court-vehicle-insurance-rule-36-228084.html
మహిళలకు బంగారం.. పుట్టిన బిడ్డలకు బంగారు ఉంగరం..!
ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం ఎత్తు పెంపునకు మహారాష్ట్ర నుంచి అనుమతులు ఇప్పించాలని జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
విశాఖ ఎకనమిక్ రీజియన్ సమగ్రాభివృద్ధికి సూక్ష్మ స్థాయి ప్రణాళికలను రూపొందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిరోజూ అత్యంత బిజీ షెడ్యూల్‌తో గడుపుతుంటారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఆగస్టు 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు, మొత్తం 3 రోజుల పాటు పార్లమెంట్‌ను ప్రత్యేకంగా సమావేశపరచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది
సెప్టెంబర్ 18లోగా పాస్‌పోర్ట్ ఇవ్వాలి.. కోర్టు ఆదేశాలు..!
డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ప్రత్యక్షమైన ఈ కంటెంట్‌ను నీచమైన, నిందాపూర్వకమైనదిగా పేర్కొంది. ఇలాంటి హానికరమైన, అసత్యపూరితమైన పోస్టులకు బహిరంగ వేదికలలో ఏమాత్రం స్థానం ఉండకూడదని స్పష్టం చేసింది.
దిల్‌సుఖ్‌నగర్‌లో తెలంగాణ టైగర్ రేవంత్ రెడ్డి కారు పేరుతో కలకలం..!
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తనపై వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.
భారత క్రీడారంగంలో స్వర్ణాక్షరాలతో లిఖించదగిన అద్భుతమైన ఘట్టం సాగర తీర నగరం విశాఖపట్నంలో ఆవిష్కృతమైంది.
ట్రైనీ మహిళా అధికారిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో అరెస్టయి ప్రస్తుతం చంచల్గూడా జైలులో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి
ఇప్పటివరకు పోలీస్ అత్యవసర సేవల కోసం వినియోగిస్తున్న డయల్ 100 స్థానంలో 112 నంబర్ ను అమలు చేయనున్నారు. పోలీస్, అంబు లెన్స్, అగ్నిమాపక సేవల ను ఒకే ఎమర్జెన్సీ నంబర్ పరిధిలోకి తీసుకురావడం ఈ కొత్త వ్యవస్థలో ప్రత్యేకత. 112కు ఫోన్ చేస్తే కేవలం పోలీస్ సహాయం మాత్రమే కాదు.. పరిస్థితిని బట్టి అంబులెన్స్, ఫైర్ సర్వీసులను కూడా సమన్వయం చేసేలా వ్యవస్థను రూపొందించారు.
మొత్తం 76 జూనియర్ కాలేజీలు ఫైర్ ఎన్ఓసీలను సమర్పించగా, వాటిలో ఎనిమిది కాలేజీలు నకిలీ, ఫోర్జ్డ్ ఎన్ఓసీలను సమర్పించినట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంపై హైడ్రా అడిషనల్ డైరెక్టర్ ఫిర్యాదు మేరకు లేక్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.