ఢిల్లీ పోలీసుల వ్యూహ వైఫల్యం.!

Publish Date:Jul 21, 2026

Advertisement

 నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి నిరసనగా కాక్రోచ్ జనతాపార్టీ పిలుపు మేరకు జరిగిన పిలుపునిచ్చిన  చలో పార్లమెంటు ఆందోళన హస్తినలో  ఉద్రిక్తతలకు దారితీసింది. వేలాది మంది నిరసనకారులు ఒక్కసారిగా వీధుల్లోకి వచ్చి పార్లమెంట్ వైపు దూసుకురావడం,  శాంతియుతంగా సాగుతుందనుకున్న ప్రదర్శన ఉద్రిక్తంగా మారడంలో పోలీసుల వ్యూహ వైఫల్యం ప్రస్ఫుటంగా బయటపడింది. 

హస్తినలో కాక్రోచ్ జనతాపార్టీ ఆందోళనలో ఉద్రిక్తత ఏర్పడడానికి కారణం పరిస్థితిని అంచనా వేయడంలో పోలీసులు ఘోరంగా విఫలం కావడమే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  గత మూడు వారాలుగా చలో సంసద్ కార్యక్రమంపై   కాక్రోచ్ జనతాపార్టీ సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల  ద్వారా వరుస ప్రకటనలు ఇస్తూనే ఉంది.   ఈ నిరసనలో    పదివేల మంది వరకు  నిరసనకారులు పాల్గొనే అవకాశం ఉందని ఢిల్లీ పోలీసులు అంచనా వేశారా. అయితే ఆ అంచనాలను తల్లకిందులు చేస్తూ.. భారీ సంఖ్యలో యువత,  విద్యార్థులు, మహిళలు  రోడ్లపైకి రావడంతో రాజధాని వీధులు జనసంద్రంగా మారిపోయాయి. 

ఈ స్థాయిలో జనం తరలిరావడానికి కాక్రోచ్ జనతా పార్టీ ముందు నుంచీ చేసుకున్న డిజిటల్ సమన్వయమే కారణంగా పరిశీలకులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది విద్యార్థులు, మహిళలు, యువకులు ఢిల్లీకి చేరుకోవడానికి వాట్సాప్ గ్రూపుల ద్వారా  పక్కాగా కమ్యూనికేట్ చేసుకున్నారు. ఈ సమన్వయాన్ని చివరి నిమిషం వరకు  నిఘా వర్గాలు పసిగట్టలేకపోవడమే ఈ పరిస్థితికి కారణమైంది. ఆందోళనకారులు చిన్న చిన్న బృందాలుగా వచ్చి ఒక్కసారిగా పార్లమెంటు ప్రధాన ద్వారం వద్దకు చేరుకున్నారు. దీంతో  పరిస్థితి   చేయిదాటిపోయిందని భావించిన పోలీసులు లాఠీఛార్జి చేశారు. దీనికి ప్రతిగా  ఆందోళనకారులు  పోలీసులపైకి రాళ్లు రువ్వారు. లాఠీఛార్జ్, రాళ్ల దాడులతో పార్లమెంట్ పరిసర ప్రాంతాలు రణ క్షేత్రాన్ని తలపించాయి.    

గతంలో ఎంతో సున్నితమైన నిర్భయ ఘటన సమయం లోనూ, సుదీర్ఘంగా సాగిన రైతు ఉద్యమాల సమయంలోనూ లక్షలాది మంది ప్రదర్శకులను అత్యంత సమర్థవంతంగా నిలువరించిన చరిత్ర ఢిల్లీ పోలీసులకు ఉంది. అలాంటి బలమైన పోలీస్ యంత్రాంగం ఈసారి   నిరసనకారులను ఏ దశలోనూ కంట్రోల్ చేయలేక చేతులెత్తేయడం విస్మయం గొలుపుతోంది.  

Chalo Parliament protest, NEET paper leak protest Delhi, Cockroach Janata Party protest, Parliament gate tension, Delhi protest lathi charge

By
en-us Political News

  
సోషల్ మీడియాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు.
కృష్ణాష్టమి 2026 సందర్భంగా భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన మథుర, బృందావనం, ద్వారక, గురువాయూర్ మరియు పూరీ జగన్నాథ ఆలయాల విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇక్కడ తెలుసుకోండి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026 అక్టోబర్ 12 నుండి 21 వరకు జరగనున్నాయి. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం మరియు వాహన సేవల సంపూర్ణ షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి.
అయోధ్య శ్రీ రామ్ జన్మభూమి మందిర్ సీఈఓ ఎంపిక కోసం ప్రతిపాదించిన ముగ్గురి పేర్ల జాబితాను కమిటీ ఈరోజు ట్రస్ట్‌కు సమర్పించనుంది. తిరుమల తరహాలో ఆలయ నిర్వహణ కోసం తీసుకున్న ఈ కీలక నిర్ణయ వివరాలు ఇక్కడ చదవండి.
పాకిస్థాన్‌లోని నారోవాల్‌లో 125 ఏళ్ల నాటి చారిత్రక హిందూ దేవాలయాన్ని రాత్రికి రాత్రే కూల్చివేశారు. ఈ ఘోరంపై స్థానిక హిందూ సంఘాల ఆగ్రహం, ఆందోళనల వివరాలు ఇక్కడ చదవండి.
టీటీడీ వేదపారాయణదారుల ఎంపిక ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారింది. తెలంగాణ అభ్యర్థులకు స్థానికత అడ్డంకిగా మారడం, అర్హత మార్కులను 85 నుండి 40కి తగ్గించడంపై వేదపండితులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నియామకాల వెనుక ఉన్న పూర్తి వివరాలు, వివాద కారణాలు ఇక్కడ చూడండి.
2026 ఆగస్టు 29 రాశి ఫలాలు, టారో కార్డుల విశ్లేషణ మరియు వాస్తు చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి. మేషం నుండి మీనం వరకు ద్వాదశ రాశుల ఉద్యోగం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి మరియు సరైన వాస్తు నివారణల సమగ్ర వివరాలు!
పశ్చిమ బెంగాల్ దుర్గాపూజ పండళ్ల లోపల మాంసాహారం నిషేధించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. 5 రోజుల ఉత్సవాల్లో సనాతన సంప్రదాయాలు పాటించాలని 600 పూజా కమిటీలకు వీహెచ్‌పీ చేసిన ప్రతిపాదనల వివరాలు.
రక్షాబంధన్ రోజున రాఖీ దారం తెగిపోవడం అశుభమా కాదా అనే సందేహాలకు వేద పండితుల సమాధానం తెలుసుకోండి. తెగిపోయిన రాఖీ వల్ల కలిగే ప్రయోజనాలు, పాటించాల్సిన నియమాలు మరియు 2026 రాఖీ శుభ ముహూర్తాల వివరాలు.
తిరుమలలో పౌర్ణమి మరియు గరుడ సేవ సందర్భంగా భక్తులు పోటెత్తారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుండగా, ఒక్కరోజే 66,437 మంది దర్శించుకోగా రూ. 4.45 కోట్ల హుండీ ఆదాయం లభించింది.
తిరుపతి ఫారెస్ట్ డివిజన్ అధికారులు అత్యంత అరుదైన 3 రోజ్-రింగ్డ్ ప్యారాకీట్స్ (రామచిలుకలను) సమర్థవంతంగా రక్షించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వాటిని తిరిగి అడవిలోకి విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి వివరాలు చదవండి.
శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే హయగ్రీవ జయంతి విశిష్టత, శ్రీమహావిష్ణువు హయగ్రీవ అవతారం ఎత్తడానికి గల ఆధ్యాత్మిక కథ మరియు విద్యార్థులకు జ్ఞానాన్ని ప్రసాదించే హయగ్రీవ పూజా విధానం గురించి వివరంగా తెలుసుకోండి.
చంద్ర గ్రహణ సమయంలో ఆధ్యాత్మిక రక్షణ మరియు మానసిక ప్రశాంతత పొందేందుకు పాటించాల్సిన సూతక కాల నియమాలు, మంత్ర జపం, గర్భవతుల జాగ్రత్తలు మరియు గ్రహణానంతర శుద్ధి, దానాల విశిష్టతలను వివరంగా తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.