సోషల్ మీడియాను లైట్ తీసుకోవద్దు.. టీడీపీ నేతలకు లోకేష్ వార్నింగ్..!

Publish Date:Sep 8, 2026

Advertisement

టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు సోషల్ మీడియాను ఎంతవరకు యాక్టివ్‌గా వినియోగిస్తున్నారనే అంశంపై ఆయన ఆరా తీశారు.

సోషల్ మీడియాను నేతలు సమర్థంగా వినియోగించాలని లోకేష్ సూచించారు. సోషల్ మీడియానే కదా అని తేలిగ్గా తీసుకోవద్దని.. దీనిపై సీరియస్‌గా దృష్టి పెట్టాలని చెప్పారు. ఏఎంసీ, కార్పొరేషన్ ఛైర్మన్లు కూడా తాము చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తున్నారని పేర్కొన్నారు.

ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు వివరించాలని.. ప్రభుత్వ పనితీరుపై ఓపెన్‌గా మాట్లాడాలని నేతలకు సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం సెల్ఫీ వీడియోల ద్వారా తన సందేశాన్ని ప్రజలకు చేరవేస్తున్నారని గుర్తుచేశారు.

తాను కూడా సుజ్లాన్ విండ్ ప్రాజెక్టులకు శంకుస్థాపన, డీఎస్సీపై జరుగుతున్న దుష్ప్రచారానికి సంబంధించి సెల్ఫీ వీడియోలు రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు లోకేష్ తెలిపారు. విషయం చిన్నదైనా, పెద్దదైనా ప్రజలకు వాస్తవాలను తెలియజేయాల్సిన బాధ్యత నాయకులపై ఉందన్నారు.

ప్రతిపక్షాల పని ఎప్పుడూ బురదజల్లడమేనని వ్యాఖ్యానించిన లోకేష్.. వారి దుష్ప్రచారాన్ని సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని సూచించారు. పార్టీ ఆదేశాలు, కార్యక్రమాలపై సోషల్ మీడియా టీమ్స్ తక్షణమే స్పందించేలా పనిచేయాలని అన్నారు.

జగన్‌కు సంబంధించిన అంశాల్లో వైసీపీ నేతలు, కార్యకర్తలు గుడ్డిగా సమర్థిస్తున్నారని లోకేష్ విమర్శించారు. అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని.. ఈ విషయాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు.

 

 

 

(Minister  Nara Lokesh, Telugu Desam Party, Amaravati, Leadership Conclave, Political Communication, Public Orientation, Social Media, TDP Leaders, Social Media Strategy, CM Chandrababu, YS Jagan, YSRCP, Telugu One, Telugu News)

By
en-us Political News

  
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేసేందుకు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది.
సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలో ఓ మానసిక రోగి హల్‌చల్‌ చేయడంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
దేశ రాజకీయాల్లో ప్రాంతీయ అసమానతలు, ఉత్తరాది ప్రాబల్యంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తన గళాన్ని గట్టిగా వినిపించారు.
జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత యువ షూటర్, తెలంగాణ ముద్దుబిడ్డ ఈషా సింగ్ అద్భుత ప్రతిభ కనబరిచారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సంబంధించి ప్రభుత్వం అధికారిక ప్రకటన జారీ చేసింది.
హైదరాబాద్ నగరంలో మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేస్తూ మరో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
బాలీవుడ్‌లో మరోసారి ఆదాయపు పన్ను శాఖ దూకుడు పెంచింది.
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంక్షేమ అధ్యాయానికి తెరలేచింది.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.