కిరణ్ కుమార్ రెడ్డి హెలికా’ప్డర్’!

Helicopter, ys, accident, kirankumar, cumulo nimbus, tour postpose, tour cancel, indiramma bataఇందిరమ్మబాటకోసం హెలికాప్టర్ లో బయలుదేరిన దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్ తిరిగిరాలేదు. ప్రతికూల వాతావరణం హెలికాప్టర్ తోపాటుగా ఆయన్ని పొట్టనపెట్టుకుందని ప్రభుత్వం ప్రకటించింది. తర్వాత.. సరైన కండిషన్ లో లేని హెలికాప్టర్ లో వెళ్లడంవల్లే ఆయన చనిపోయారని చాలామంది అనుకున్నారు. కొందరైతే కావాలనే వై.ఎస్ ని హత్యచేయడానికి అలాంటి ఏర్పాట్లు చేశారంటూ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. అభిమానం వాళ్లతో అలా మాట్లాడించిందని, నిజానికి అలాంటిదేంలేదని ప్రభుత్వం గట్టిగానే చెప్పింది. ఏదేమైనా కోట్లమంది అబిమానాన్ని సంపాదించుకున్న నాయకుడు అర్థంతరంగా తిరిగిరాలేని లోకాలకు తరలిపోయాడు. అప్పట్నుంచి ముఖ్యమంత్రులందరికీ హెలికాప్టర్ ఎక్కాలంటేనే భయం పట్టుకుంది. మూడురోజుల ఇందిరమ్మబాటకోసం హెలికాప్టర్ ప్రయాణం పెట్టుకున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి క్యుములో నింబస్ మేఘాల కారణంగా ప్రయాణాన్ని రద్దుచేసుకున్నారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కూడా ఈ సారి రిస్క్ తీసుకోవడానికి ఏమాత్రం ఇష్టపడకుండా లేటెస్ట్ ముఖ్యమంత్రిని కాపాడుకునేందుకు కాస్త కటువుగానే వ్యవహారించింది. ప్రయాణానికి వాతావరణం అనుకూలంగా లేదని తేల్చిచెప్పేసింది. ఈ మాటే వై.ఎస్ ప్రయాణమయ్యేటప్పుడుకూడా కాస్త గట్టిగా చెప్పుంటే బాగుండేదని పెద్దాయన అభిమానులంతా గట్టిగా అనుకుంటున్నారు.