ఈ వారం ఓటీటీలో సినిమా పండుగ!

ప్రస్తుతం థియేటర్లలో 'కల్కి 2898 AD' ప్రభంజనం కొనసాగుతోంది. దాంతో ఈ వారం థియేటర్లలో చెప్పుకోదగ్గ సినిమాల విడుదల లేదు. అయితే ఓటీటీలో మాత్రం పలు సినిమాలు, సిరీస్ లు ప్రేక్షకులకు వినోదాన్ని పంచనున్నాయి. 

పవన్ సిద్ధూ, సోనియా సింగ్ జంటగా నటించిన వెబ్ సిరీస్ 'శశిమథనం'. వినోద్ గాలి దర్శకత్వంలో రూపొందిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక సుమంత్ హీరోగా నటించిన 'అహం రీబూట్' మూవీ ఆహా వేదికగా నేరుగా ఓటీటీలో విడుదలైంది. వీటితో పాటు మరికొన్ని సినిమాలు, సిరీస్ లు అలరించనున్నాయి.

ఈటీవీ విన్:
శశిమథనం సిరీస్ - జూలై 4 

ఆహా:
అహం రీబూట్ తెలుగు మూవీ - జూలై 1
మార్కెట్ మహాలక్ష్మి - జూలై 4 

అమెజాన్ ప్రైమ్ వీడియో:
గరుడన్ తమిళ్ మూవీ - జూలై 3
మీర్జాపూర్ సిరీస్ సీజన్ 3 - జూలై 5 

జియో సినిమా:
ప్రైమ్ టైమ్ విత్ మూర్తీస్ (హిందీ సిరీస్) - జూలై 3 

నెట్‌ఫ్లిక్స్ :
స్ప్రింట్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 2 
ద మ‍్యాన్ విత్ 1000 కిడ్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 03 
బార్బెక్యూ షో డౌన్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్)- జూలై 4
డెస్పరేట్ లైస్ (పోర్చుగీస్ సిరీస్) - జూలై 5
గోయో (స్పానిష్ మూవీ) - జూలై 5