ఆ ఒక్క రోజే నాని విశ్వరూపం చూపిస్తాడు...

'అంటే సుంద‌రానికీ' తర్వాత న్యాచురల్ స్టార్ నాని (Nani), డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'సరిపోదా శనివారం' (Saripodhaa Sanivaaram). డీవీవీ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ మూవీ ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. తాజాగా మరో కొత్త పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. ఇప్పటిదాకా విడుదలైన ప్రచార చిత్రాల్లో నాని లుక్ మాస్ గా ఉంటే.. తాజా పోస్టర్ లో మాత్రం క్లాస్ గా ఉంది.

'సరిపోదా శనివారం'లో సూర్య అనే పాత్రలో నాని అలరించనున్నాడు. శనివారం నాడు వయలెంట్ గా మారి విశ్వరూపం చూపించే నాని.. మిగతా రోజుల్లో మాత్రం కూల్ గా కనిపిస్తాడు. తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో కూడా.. బైక్ మీద వెళ్తూ మిడిల్ క్లాస్ యువకుడిగా కూల్ గా కనిపిస్తున్నాడు. గతంలో విడుదల చేసిన మాస్ లుక్ ని, లేటెస్ట్ క్లాస్ లుక్ ని పోలుస్తూ.. "ఆ మాస్, క్లాసుల మధ్యన ఊగుట వీడికి అలవాటు" అని రాసుకొచ్చారు మేకర్స్. మరి మిగతా రోజుల్లో కూల్ గా ఉంటూ, శనివారం మాత్రం ఫైర్ లా ఉండే పాత్ర పోషిస్తున్న నాని.. 'సరిపోదా శనివారం'తో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.