విజయ్.. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తన 68వ సినిమాని వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ తాజాగా రివీల్ అయ్యాయి.

ఈ సినిమాకి 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం' అనే టైటిల్ పెట్టారు. న్యూ ఇయర్ కానుకగా తాజాగా టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. పోస్టర్ ని బట్టి చూస్తే ఎయిర్ ఫోర్స్ రిలేటెడ్ ఫిల్మ్ అనిపిస్తోంది. అలాగే విజయ్ డ్యూయల్ రోల్ లో కనిపిస్తున్నాడు. ఒకటి యంగ్ రోల్ కాగా, మరొకటి మిడిల్ ఏజ్ రోల్. మరి ఈ చిత్రం విజయ్ కి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ప్రశాంత్, స్నేహ, యోగిబాబు తదితరులు నటిస్తున్నారు.