అలీ భాయ్.. టీడీపీ వైపు రాకు.. నీకోదణ్ణం!

అధికారంలో వుంటేనే ఎవరైనా దగ్గరుంటారు. లేకపోతే అలీ లాగా అవుతారు. కమెడియన్ అలీ మొన్నటి వరకూ జగన్ పార్టీలో నాయకుడిగా చెలామణీ అయ్యారు. ఈసారి ఎన్నికలలో అలీ పార్లమెంటుకో, అసెంబ్లీకో పోటీ చేసే అవకాశాలు వున్నాయని మొదట్లో వార్తలు వచ్చాయి. అయితే, అలాంటి ప్రమాదమేమీ జరక్కుండానే ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. వైసీపీ అధికారంలో వున్నంతకాలం ఏదో ఒక బుడ్డి నామినేటెడ్ పోస్టు వెలగబెట్టిన అలీ, అడపాదడపా ఏదైనా మీటింగ్‌లో కనపడి నాలుగు జోకులు వేయడం, తెలుగుదేశం మీద రెండు కామెంట్లు చేయడం తప్ప ఆ పార్టీకి ఒరగబెట్టిందేమీ లేదు. అసలు అలీ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాడన్నది ఒక పజిల్ అయితే, ఏ పాయింట్ నచ్చి వైసీపీలో చేరాడా అన్నది మరో పజిల్. సరే, ఇప్పుడు వైసీపీ అధికారం కోల్పోయింది కాబట్టి, ఇక తనకు వర్కవుట్ అయ్యేదేమీ లేదు కాబట్టి అయ్యగారు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేసి బయటపడ్డారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేసి ‘‘వైసీపీకి టాటా.. బైబై.. ఇట్లు ఆలీ భాయ్’’ చెప్పారు. ఇక తనకి, రాజకీయాలకి ఎలాంటి సంబంధం లేదని, తాను కూడా ఇప్పుడు అందరిలాంటి ఓటర్నే అని చెప్పుకొచ్చారు.

రాజకీయాలకు ఒక వైపు గుడ్ బై చెప్పినట్టే చెప్పిన ఆయన, టీడీపీలో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలో తనకు పరిచయం వున్న వారికి టచ్‌లోకి వెళ్ళినట్టు తెలుస్తోంది. అయితే అలీ వుద్దేశాన్ని గమనించిన సదరు తెలుగుదేశీయులు అయ్యా.. నిన్ను మా పార్టీలో చేర్చుకునే అవకాశం ఎంతమాత్రం లేదని ముఖంమీదే చెప్పినట్టు సమాచారం. అలీ విడుదల చేసిన వీడియోలో తాను ఎవర్నీ విమర్శించలేదని చెప్పుకున్నారుగానీ, తెలుగుదేశం పార్టీ మీద బాగానే పంచ్‌లు వేశారు. అసలు వైసీపీ నుంచి వచ్చే శనిగ్రహాలను తెలుగుదేశం పార్టీలోకి తీసుకుని ఉద్దేశం పార్టీ నాయకుడికి ఎంతమాత్రం లేదు. అందువల్ల అలీ లాంటి ఆటలో అరటిపళ్ళు తెలుగుదేశం పార్టీ జోలికి రాకుండా పని చూసుకుంటే బెటర్.