రాజమౌళి మహేష్ ల సినిమా ఇండియన్ సినిమా కాదా? ఫ్యాన్స్ పరిస్థితి ఇది!

2024  వచ్చేసింది. బహుశా మహేష్ ఫాన్స్ తో పాటు సినీ అభిమానులు ఒక వార్త కోసం ఈ రోజు నుంచే వెయిట్ చేస్తుంటారు అసలు వాళ్ళు ఎదురుచూసే వార్త  అధికారకంగా బయటికి  వస్తేనే  వాళ్ళందరు  2024 వచ్చినట్టుగా కూడా ఫీల్ అవుతు ఉంటారనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రాజమౌళి, మహేష్ ల  కొత్త సినిమా  ఎప్పుడు ఎప్పుడు  ప్రారంభమవుతుంది  అంటూ ఎదురుచూసే వాళ్లకి ఇప్పుడు ఒక న్యూస్  కొత్త సంవత్సరపు జోష్ ని తెచ్చింది.

మహేష్ రాజమౌళి ల సినిమా ఈ సంవత్సరం మార్చిలో ప్రారంభం కాబోతుందనే ఒక వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అలాగే ఇండియన్ సినిమా హిస్టరీలో ఇంతకు ముందెన్నడూ రాని  ఆఫ్రికా బ్యాక్‌ డ్రాప్‌ లో అడ్వెంచర్ థ్రిల్లర్‌  కథా నేపథ్యంగాఆ మూవీ తెరకెక్కతుందనే ప్రచారం కూడా ఉంది. అలాగే ఈ  కథలో హీరోయిన్ పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందని ఆ పాత్రలో ప్రియాంక చోప్రా నటిస్తే బాగుంటుందని కూడా మేకర్స్ బావిస్తున్నారనే ఒక వార్త కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. కాకపోతే ఈ విషయాలన్నిటి గురించి చిత్ర బృందం అధికారకంగా ప్రకటించాలసి ఉంది. 

మొన్న ఈ మధ్య  కథారచయిత  విజయేంద్రప్రసాద్‌ ఒక  ఇంటర్వ్యూలో మాట్లాడుతు. నేను, రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్‌ స్మిత్‌ కు పెద్ద అభిమానులం. అందుకే ఆయన పుస్తకాల ఆధారంగానే మహేష్ కొత్త సినిమా స్క్రిప్ట్ ను రాయాలనుకుంటున్నాను  అంటూ చెప్పుకొచ్చాడు. సో దీన్ని బట్టి మహేష్ రాజమౌళిల సినిమా ఎవరి ఊహకి అందని ఒక సరికొత్త సబ్జెక్టు అని అర్ధం అవుతుంది.