మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తొలగింపు

తెలంగాణ ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది. కొత్త కొలువుల భర్తీ కోసం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ తొలగించిన ఉద్యోగులందరూ ఇప్పటికే పదవీ విరమణ చేసి కాంట్రాక్ట్ పద్దతిపై పని చేస్తున్నవారే.

ఇలాంటి 6729 మంది ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం తొలగించింది. ఇలా తొలగించిన వారిలో మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు వంటి కీలక అధికారులు సైతం ఉన్నారు. వీరి తొలగింపుతో కొత్తగా ఆరువేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.