కేజ్రీవాల్ పై కేసు నమోదు
posted on Mar 28, 2025 1:56PM
ఆమ్ ఆద్మీ పార్టీ నేత , మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్టు కేజ్రీవాల్ పై ఆరోపణలు వచ్చాయి. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఢిల్లీలో భారీ హోర్డింగ్ లు పెట్టి ప్రజాధనాన్ని కేజ్రీవాల్ దుర్వినియోగం చేసినట్టు ఆరోపణలు రావడంతో కోర్టు ఆదేశాల మేరకు కేజ్రీవాల్ పై కేసు నమోదుచేశారు. 2019 ద్వారకలో భారీ హోర్డింగ్ లు పెట్టి కేజ్రీవాల్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్టు ఓ వ్యక్తి రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ అభ్యర్థన మేరకు కోర్టు కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు కు సంబంధించి నివేదికను పోలీసులు కోర్టుకు సమర్పించారు.
ఈ కేసులో విచారణ జరుగుతుందని, మరికొంత సమయం కావాలని పోలీసులు న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. విచారణకు కోర్టు వచ్చేనెల 18కి వాయిదా వేసింది.