నిత్యానంద స్వామి ఇక లేరు?
posted on Apr 1, 2025 4:23PM
తమిళనాడుకు చెందిన వివాదాస్పద స్వామి నిత్యానందస్వామి మరణించినట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఆయన మేనల్లుడు సుందరేశ్ నుంచే ఈ ప్రకటన వెలువడింది. సినీ నటి రంజితతో రాసలీలతో ఆయన ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. 2022లో కూడా నిత్యానంద స్వామి చనిపోయినట్టు వచ్చిన వార్తలను స్వయంగా ఖండించారు. ప్రస్తుతం వస్తున్న మరణ వార్తలను ఇంతవరకు నిత్యానంద స్వామి ఖండించలేదు. తమిళనాడు అరుణాచలంకు చెందిన నిత్యానంద స్వామి కైలాస పేరిట ప్రత్యేక దేశం ఏర్పాటు చేసుకున్నారు. కైలాస దేశానికి ప్రత్యేక కరెన్సీ కూడా ఉంది. ఇండియా నుంచి వెళ్లిపోయిన నిత్యానంద ప్రత్యేక ఐలాండ్ లో కైలాస దేశం ఏర్పాటు చేసుకున్నారు. నాలుగు వేల కోట్లకు అధిపతి అయిన నిత్యానందకు వారసులు ఎవరు అనేది ప్రశ్నార్ణకమైంది. కైలాస దేశానికి నిత్యానంద ప్రధాని పదవిలో ఉన్నట్టు స్వయంగా ప్రకటించుకున్నారు. దక్షిణ అమెరికా ఈక్వెడార్ లో కైలాస దేశం ఉందని చెబుతుంటారు. .