47 మార్కెట్ కమిటీలకు చైర్మన్ల నియామకం

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నామినేటెడ్ పదవుల భర్తీపై దృష్టి సారించారు. ఇప్పటికే రెండు విడతలుగా నామినేటెడ్ పదవులను భర్తీ చేసిన ఆయన తాజాగా మూడో విడతలో 47 మార్కెట్ కమిటీలకు చైర్మన్లను ప్రకటించారు.

అలాగే ఆయా మార్కెట్ కమిటీల సభ్యులతో కలిసి మొత్తం 705 పోస్టులను భర్తీ చేశారు. తాజాగా ప్రకటించిన 47 మార్కెట్ కమిటీల చైర్మన్ పదవులలో తెలుగుదేశం పార్టీకి 37, జనసేనకు ఎనిమిది, బీజేపీకి రెండు దక్కాయి. త్వరలోనే మిగిలిన మార్కెట్ కమిటీలను కూడా భర్తీ చేయనున్నట్లు తెలుగుదేశం వర్గాలు తెలిపాయి.