పేర్నిజయసుధ బెయిల్ రద్దుచేయాలని కోరుతూ  హైకోర్టులో పిటిషన్ 

పేర్ని జయసుధ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ కూటమిప్రభుత్వం ఎపి హైకోర్టులో పిటిషన్ వేసింది. మాజీ మంత్రి పేర్ని నాని భార్య రేషన్ బియ్యం మాయం చేసిన కేసులో  ప్రధాన నిందితురాలు. ఈ కేసులో పేర్ని నానికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయన భార్య జయసుధకు  కూడా  మచిలీపట్నం కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. మచిలీ పట్నం కోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం   మంగళవారం  పిటిషన్ దాఖలు చేసింది  కౌంటర్ దాఖలు చేయడానికి సమయం ఇవ్వాలని జయసుధ కోరడంతో విచారణ ఈ నెల 10వ తేదీకి  హైకోర్టు వాయిదా  వేసింది.