నృత్య రీతుల్లో అత్యంత క్లిష్టమైనది కూచిపూడి!

జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఎనిమిది క్లాసికల్ నృత్య రీతులలో  కూచిపూడి నృత్యం అత్యంత క్లిష్టమైనది. దీనిలో కాలి వేళ్లనుండి ఆపాదమస్తకం డాన్స్ లో భాగం గా స్పందించి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంతటి గొప్ప కళ ప్రపంచంలో మరెక్కడా లేదని ఆల్ ఇండియా న్యూస్ పేపర్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ,సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చలాది  పూర్ణచంద్ర రావు పేర్కొన్నారు . ఉగాది ఉత్సవాల సందర్భంగా మచిలీపట్టణం సమీపంలోని  కూచిపూడి నాట్యకళకు జన్మ స్థలం  కూచిపూడిలో  రెండురోజులపాటు  నాట్యగురు,కేంద్ర సాహిత్య,నాటక అవార్డు గ్రహీత డా. వేదాంతం రాధే శ్యామ్ నేతృత్వం లో  జరుగుతున్న "కూచిపూడి నాట్య శిల్పారామం"  నృత్యోత్సవాలలో  మొదటిరోజు ముఖ్య అతిధిగా  పాల్గొన్న వేదాంతం రాధేశ్యామ్   జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసంగించారు.  పేద మధ్య తరగతి విద్యార్థులు ఈ అపురూపమైన నృత్యం నేర్చుకున్నప్పటికీ పలువురు ప్రదర్శనలు ఇచ్చేందుకు అవసరమైన ఖరీదైన కాస్ట్యూమ్స్,ఇమిటేషన్ ఆభరణాలు కొనలేని స్థితిలో  వున్నారనీ, అటేవంటివవారికి ప్రభుత్వం, దాతలు నృత్య దుస్తులు, ఇమిటేషన్ ఆభరణాలు  సమకూర్చాలని కోరారు. 

నాట్య గురు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ బాల కొండలరావు   విశాఖపట్నం లో తానూ స్థాపించిన కూచిపూడి నాట్య అకాడెమి ద్వారా వేలాది మంది నృత్య కళాకారిణులను తీర్చి దిద్దినట్లు ఆమె తెలిపారు.  విశాఖపట్నం, పార్వతీపురం,హైదరాబాద్,లతో పాటు పలు ప్రాంతాలనుండి వచ్చిన విద్యార్థులు, నాట్య గురువు లతో కూచిపూడి లొ ఉగాది నాట్య ఉత్సవం వైభవంగా జరిగింది.