టీడీపీ మాజీలకు స్వర్ణయుగం

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మాజీ టీడీపీ నాయకులకు స్వర్ణయుగం నడుస్తోంది. టీఆర్ఎస్ నాయకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయానా టీడీపీ మాజీ నాయకుడు. ఒకప్పుడు టీడీపీలో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా చక్రం తిప్పిన వాళ్ళ హవా ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వలో నడుస్తోంది. తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస యాదవ్, పోచారం శ్రీనివాసరెడ్డి, జోగు రామన్న, మహేందర్ రెడ్డి, అజ్మీరా చందూలాల్... లేటెస్ట్‌గా కడియం శ్రీహరి... ఇలా ఒక్కరూ ఇద్దరూ ఏమిటీ... బోలెడంత మంది టీడీపీ మాజీ నాయకులు టీఆర్ఎస్ ప్రభుత్వంలో పదవులు పొంది హ్యాపీగా వున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణ టీడీపీలో ఉన్న ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ వైపు ఆశగా చూస్తున్నట్టు తెలుస్తోంది. టీడీపీని విడిచిపెట్టి టీఆర్ఎస్‌లోకి వెళ్ళిపోతే తమకు కూడా పైన చెప్పిన నాయకుల తరహాలోనే రాజకీయ స్వర్ణయుగం వస్తుందని ఆశిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు అయితే బహిరంగంగానే తమ కోర్కెల చిట్టా విప్పి, ఈ కోర్కెలు తీరిస్తే టీఆర్ఎస్‌లోకి వచ్చేస్తామని బేరాలు పెట్టేశారు. ఈ పరిస్థితిని చూసి దేశం నాశనమైపోతోందని బాధపడకండి.. రాజకీయాలే ఇంత!

Online Jyotish
Tone Academy
KidsOne Telugu