మోడీ మౌనం దేనికి సంకేతం?
posted on Dec 25, 2025 8:36AM
.webp)
బంగ్లాదేశ్ లో హిందూ వ్యతిరేకత పెచ్చరిల్లుతుంటే మోడీ మౌనం వహించడంపై సర్వత్రా తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తం అవుతున్నది. అసలు కేంద్రంలోని మోడీ సర్కార్ కీలక విషయాలలో ఆమోదయోగ్యం కాని నిర్లక్ష్యం వహిస్తున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధానిగా ఇందిరాగాంధీ ఉండి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదన్న అభిప్రాయమూ వ్యక్తమౌతోంది. మణిపూర్ విషయంలో కానీ, అసలు కీలక సమస్యలపై పార్లమెంటులో చర్చ విషయంలో కానీ మోడీ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు ఏ మాత్రం సరిగా లేదని అంటున్నారు.
ఇప్పటికీ మణిపూర్ మరక అలాగే ఉంది. ఆ రాష్ట్రంలో ప్రధాని పర్యటించినపుడు కూడా ఎలాంటి స్పందనా లేదు. అదలా ఉంటే.. తాజాగా పార్లమెంటు సమావేశాలలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు అయిన రాహుల్ గాంధీ పట్టుబట్ట బట్టి, ఓట్ చోర్ వ్యవహారంలో ఆ మాత్రమైనా చర్చ జరిగింది. అది పక్కన పెడితే.. ఢిల్లీ కారుబాంబు పేలుడు వంటి కీలకాంశాలు సభలో అసలు చర్చకే రాలేదు. అలాంటి అత్యంత కీలక విషయాలను వదిలేసి.. వందేమాతరంపై గంటల తరబడి ప్రసంగాలు దంచి సమయాన్ని వృధా చేసింది అధికార పక్షం. ఓకే దేశం.. ధర్మం కోసం.. దేశ భక్తి హిందుత్వ అన్నది నిజంగానే కేంద్రంలోని మోడీ సర్కార్ కు అంత ముఖ్యమైనది అనుకుంటే.. బంగ్లాదేశ్ లో ఒక హిందువును సజీవంగా దహనం చేస్తూ కనీస స్పందన కూడా లేకపోవడాన్ని ఏమనుకోవాలి? ఇక్కడే ఈ సమయంలో ప్రధానిగా ఇందిరాగాంధీ ఉండి ఉంటే పరిస్థితి ఇలా ఉండేదా? అన్న చర్చ జరుుగతోంది.
బంగ్లాదేశ్ లో ప్రస్తుతం యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం నడుస్తోంది. ఆయన ప్రజాస్వామికంగా ఎన్నికైన పాలకుడు కాడు. అనివార్య పరిస్థితుల వల్ల ఆయనకు అవకాశం దక్కింది. ఆయన తీరు కారణంగా ఇప్పటికే బంగ్లాదేశ్ సైన్యం అక్కడి ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేస్తున్నది. యూనస్ సర్కార్ ప్రజా ప్రభుత్వం కాదు కనుక ఆయన ఆదేశాలను పాటించాల్సిన అవసరం లేదని మొండికేస్తున్నది.
అదలా ఉంటే.. యూనస్ అత్యంత ప్రమాదకరమైన భారత వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు. ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించే యత్నం చేస్తున్నారు. చైనాతో కలసి బారత వ్యతిరేక కుట్రలకు పాల్పడుతున్నారు. అలాగే దేశంలో హిందువులపై అత్యంత అమానవీయంగా దౌర్జన్యకాండ సాగు తోంది. తాజాగా ఒక హిందువును సజీవ దహనం చేసిన ఘటనలో కేంద్రం కనీసం స్పందించలేదు. ఆయన అక్కడ పరమత దూషణకు పాల్పడలేదు.. కేవలం దేవుడు ఒక్కడేగానీ ఆయన పేర్లు ఎన్నో అని మాత్రమే అన్నాడు. ఆ మాత్రానికే అతడిని సజీవదహనం చేశారు. అలాంటి బంగ్లా ప్రభుత్వంపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ దేశ వ్యాప్తంగా వినిపిస్తోంది. డిమాండ్లు హోరు మంటున్నాయ్. హిందుత్వ, దేశ భక్తి, అఖండ భారతం అంటూ వల్లెవేసే మోడీ సర్కార్..బంగ్లాలో హిందువులపై జరు గుతున్న దౌర్జన్యాలు, దాడులపై స్పందించకపోడం సరికాదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతోంది.