బ్యాలెట్ బీజేపీకి కలిసిరాదా?

తెలంగాణ‌లో  ఎనిమిది ఎంపీ సీట్లున్న బీజేపీకి క‌నీసం 800 పంచాయితీలు కూడా ఎందుకు గెల‌వ‌లేక పోయింది?  ఇదీ ప్ర‌స్తుతం పొలిటికల్ సర్కిల్స్, సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్న చర్చ.   బ్యాలెట్ ఓటింగ్ అంటే బీజేపీకి ఇందుకే అంత‌ భ‌య‌మ‌నీ, అందుకే ఆ పార్టీ  ఈవీఎంలతోనే నెట్టుకొస్తోంద‌నీ నెటిజనులు పెద్ద ఎత్తున సెటైర్లు గుప్పిస్తున్నారు.   మోడీ మూడు సార్లు ప్ర‌ధాని కాగ‌లిగార‌ంటే ఈవీఎంల పుణ్యం కూడా ఎంతో కొంత ఉందని అంటున్నారు. కాంగ్రెస్, ఆ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం దేశం కోసం కాకుండా,   మోడీ కోసం పని చేస్తోందా అన్న సందేహాలనూ వ్యక్తం చేస్తున్నారు.  

 తెలంగాణలో మూడు విడ‌త‌లుగా జరిగిన పంచాయితీ  ఎన్నిక‌ల్లో కాంగ్రెస్- 7, 093 పంచాయితీల‌ను కైవ‌సం  చేసుకోగా, బీఆర్ఎస్- 3488, బీజేపీ- 699, సీపీఐ- 79, సీపీఎం- 75, ఇత‌రులు- 1264 పంచాయితీలను గెలిచాయి. 

ఈ లెక్క‌న చూస్తే బీజేపీ 10 స్ట్రైక్ రేట్ కనీసం పది శాతం కూడా లేదని తేటతెల్లమౌతోంది.  మ‌రి ఇదే  బీజేపీ లోక్ స‌భ ఎన్నిక‌ల్లో  ఎనిమిది స్థానాలలో ఎలా గెలవగలిగింది అని ప్రశ్నిస్తున్నారు. 

బీజేపీకి ఎనిమిది ఎంపీ సీట్లు అంటే ఇట్స్ నాటే జోక్. కార‌ణం ఇక్క‌డున్న‌వే  17 సీట్లు. వీటిలో 8 గెల‌వ‌డం అంటే స‌గానికి స‌గం.. గెల‌వ‌డంతో స‌మానం. అలాంటిది ప‌ది శాతం పంచాయితీలు కూడా ఎందుకు రాలేద‌ని అడిగే వారికి తెలియాల్సింది ఏంటంటే.. బీజేపీని ఓట‌ర్లు ఎంపిక చేయ‌డంలో అర్ధం.. ప్రెజంట్ సిట్యువేష‌న్ ప్ర‌కారం.. ఈ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఇక్క‌డి నుంచి ఎంపీల‌ను పంపిస్తే.. వారు రాష్ట్రానికి ఏదైనా సాదించి తీస్కొస్తార‌ని. ఇక్క‌డ వాస్త‌వ  ప‌రిస్థితి ఏంటి అన్న‌ది  అటుంచితే.. ఓట‌ర్ల అభిమ‌తం అయితే అదీ. 

ఇక కాంగ్రెస్ కూడా బీజేపీకి మ‌ల్లే  జాతీయ పార్టీ. మ‌రి  ఆ  పార్టీకి  ఏడు వేల పైచిలుకు పంచాయితీలు రావ‌డానికి గ‌ల కార‌ణాలేంటి? అని చూస్తే రాష్ట్ర స్థాయిలో ఏ పార్టీ  అధికారంలో ఉన్నా.. ఆ పార్టీకి ఈ స్థాయిలో సీట్లు రావ‌డం త‌ర‌త‌రాలుగా జ‌రుగుతూ వ‌స్తున్న‌దే. ఇందులో ఎలాంటి విచిత్రం ఏమీ లేదు. గ‌తంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న‌పుడు కూడా ఇక్క‌డా పార్టీ స‌రిగ్గా ఇలాంటి ఫ‌లితాల‌నే చ‌వి చూసింది. బీఆర్ఎస్ గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓడే వ‌ర‌కూ కూడా ఒక‌టీ అరా  త‌ప్పించి.. అన్ని  ర‌కాల  ఎన్నిక‌ల్లోనూ విజ‌య ఢంకా  మోగిస్తూనే వ‌చ్చింది.

కేర‌ళ‌లోని ట్రివేండ్రం లోక‌ల్ బాడీ  ఎలక్ష‌న్స్ లో బీజేపీ  విజ‌య దుందుభి మోగించింది. ఈ కార్పొరేష‌న్లో అధికారం చేప‌ట్టింది.  ఇన్నాళ్ల పాటు ఇక్క‌డ హిందుత్వం గానీ ఆర్ఎస్ఎస్ వాదుల‌కుగానీ పెద్ద గొప్ప ఆస్కార‌ముండేది  కాదు.  ఆద‌ర‌ణ ల‌భించేది కాదు. పైపెచ్చు క‌మ్యూనిస్టుల చేతుల్లో ఆర్ఎస్ఎస్ కార్య‌క‌ర్త‌ల‌ హ‌త్యాకాండ సైతం  న‌డిచేది. ఇక్క‌డ క‌మ్యూనిస్టుల‌దే రాజ్యం. కానీ ఇప్పుడ‌క్క‌డ సురేష్ గోపీ  రూపంలో ఒక ఎంపీ గెల‌వ‌డం  మాత్ర‌మే కాకుండా.. స్థానికంగానూ స‌త్తా చాటింది బీజేపీ. అక్క‌డా బ్యాలెట్ ఓటింగే  జ‌రిగి ఉంటుంది. మ‌రి  అక్క‌డి గెలుపును వీరంతా  ఎందుకు ఒక ప్రామాణికంగా  తీస్కోరు? అన్న  ప్ర‌శ్న  వినిపిస్తోంది.

నిజంగా కాంగ్రెస్ చెప్పిన‌ట్టు ఓట్ చోరీయే జ‌రిగి ఉంటే, స‌ర్ రూపంలో ల‌క్ష‌లాది ఓట్లు పోయి ఉన్న మాట నిజ‌మైతే.. ప్ర‌జ‌లు ఈ ప్ర‌చారాన్ని ఓట‌ర్లు ఎందుకు న‌మ్మ‌డం లేదు? అన్న‌దొక ప్ర‌శ్న‌. రాహుల్ మీడియా ప్రెజంటేష‌న్లు ఇచ్చి.. ఇంత నెత్తీ  నోరు బాదుకున్నా.. జ‌నం  న‌మ్మ‌లేదంటే దాన్నెలా అర్ధం చేసుకోవాలి? ఆలోచించాల్సిన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇదే బ్యాలెట్ల  రూపంలోనే ఇక్క‌డ త‌క్కువ వ‌చ్చిన బీజేపీ, కేర‌ళ‌లో విజ‌య ఢంకా మోగించిన‌దాన్ని ఎందుకు మ‌రుస్తున్నారు? అన్నది కూడా మ‌న‌మంతా ప‌రిశీలించాల్సి ఉందంటారు విశ్లేష‌కులు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu