జగన్ ఒక అపరిచితుడు: తెదేపా

 

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆరంభమయిన క్షణం నుండే అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాదోపవాదాలతో చాలా వేడిగా మొదలయ్యాయి. పుష్కరాల మొదటిరోజు త్రొక్కిసలాటలో మరణించినవారి మృతికి సంతాపం ప్రకటిస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై జగన్ చాలా అనుచిత వ్యాఖ్యలు చేసారు.వారి మృతికి ఆయనే కారణమని, మళ్ళీ ఆయనే వారికి సంతాపం ప్రకటించడం కత్తితో పొడిచిన తరువాత పూలదండ వేసినట్లుందని అనడంతో తెదేపా సభ్యులు తీవ్రంగా స్పందించారు.

 

జగన్ కి ఎక్కడ ఏవిధంగా తెలియము మూర్ఖుడని మంత్రి అచ్చెం నాయుడు విమర్శించారు. పుష్కరాలను సజావుగా నిర్వహించడానికి ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో ప్రయత్నించినప్పటికీ, దురదృష్టవశాత్తు త్రొక్కిసలాటలో కొందరు మృతి చెందారని దానికి ప్రభుత్వం కూడా చాలా బాధపడుతోందని కానీ జగన్ వారి మృతిని కూడా రాజకీయం చేయాలనీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తరువాత గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిలో ఒక అరిచితుడు దాగి ఉన్నాడని, అతను ప్రతీ అంశాన్ని రాజకీయం చేయడానికే ప్రయత్నిస్తుంటాడని విమర్శించారు.