సైలెంట్ గా వచ్చేసిన సత్యభామ.. ఏం చేస్తుందో..!

కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) టైటిల్ రోల్ పోషించిన రీసెంట్ మూవీ 'సత్యభామ' (Satyabhama). సుమన్ చిక్కాల దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ జూన్ 7న థియేటర్లలో విడుదలైంది. థియేటర్లలో పరవాలేదు అనే టాక్ తెచ్చుకున్న ఈ మూవీ.. మూడు వారాలకే ఓటీటీలోకి అడుగుపెట్టింది.

'సత్యభామ' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ముందుగా ఎటువంటి అనౌన్స్ మెంట్ చేయకుండానే.. సైలెంట్ గా స్ట్రీమింగ్ కి తీసుకొచ్చింది. ఈరోజు (జూన్ 28) నుంచి ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. మరి థియేటర్లలో పరవాలేదు అనిపించుకున్న సత్యభామ.. ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

ఆరుమ్ ఆర్ట్స్ నిర్మిస్తున్న 'సత్యభామ' సినిమాలో నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్షవర్ధన్, రవి వర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా విష్ణు బేసి, ఎడిటర్ గా కోదాటి పవన్ కళ్యాణ్ వ్యవహరించారు.