డైరెక్టర్ అన్వేషణలో చిరంజీవి.. విశ్వంభర రిజల్ట్ తో సంబంధం లేదు

మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi)ది ఒక ఫేమస్ డైలాగ్ ఉంది. జస్ట్ గ్యాప్ వచ్చిందంతే టైమింగ్ లో మనల్ని మించిన వాళ్ళు ఉండరు అని.  పేరుకే  ఈ డైలాగ్ ని  చిరు సినిమాలో చెప్పాడనే విషయం ఆయన అభిమానులకే కాదు ప్రేక్షకులకి కూడా తెలుసు. ఎందుకంటే  నాలుగు దశాబ్దాలపై నుంచి కెరీర్ పరంగా  ఎప్పటికప్పుడు జెట్ స్పీడ్ వేగంతో వెళ్తుంటాడు.అందుకు మరో ఉదాహరణే ఫిలిం సర్కిల్స్ లో తాజాగా వినిపిస్తున్న న్యూస్.

భోళాశంకర్ పరాజయంతో కథల విషయంలో చిరు డైలమాలో పడ్డాడని,  విశ్వంభర (vishwambhara)తర్వాత కూడా సరైన కథ కోసం చాలా గ్యాప్ తీసుంటాడని కొంత మంది భావించారు.  కానీ అక్కడుంది చిరు అనే విషయం మర్చిపోయారు. వాళ్ళందరి మైండ్ బ్లాక్ అయ్యేలా విశ్వంభర తర్వాత  మూడు సినిమాలు చెయ్యబోతున్నాడు. ఈ మేరకు స్టోరీస్ కూడా విని లూప్  లైన్ లో పెట్టుకున్నాడు. అందులో ప్రముఖ రచయిత, దర్శకుడు  మచ్చ రవి కథ ఒకటి. చిరు కూడా కథ నచ్చడం తో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కాకపోతే డైరెక్టర్ గా  మాత్రం మచ్చ రవి  కాకుండా వేరే వ్యక్తి ఉంటాడు. ఈ మేరకు డైరెక్షన్ అన్వేషణలో పడ్డారు.  ఇక కార్తికేయ  దర్శకుడు చందు మొండేటి ,గబ్బర్ సింగ్  హరీష్ శంకర్ లకి  కూడా చిరు  ఒకే చెప్పాడు. 

వీటిల్లో ఫస్ట్  మచ్చ రవి కథ షూటింగ్ కి వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే  చందు మొండేటి ప్రస్తుతం నాగ చైతన్య  తండేల్ (thandel)చేస్తు  బిజీగా ఉన్నాడు. హరీష్  కూడా రవితేజ తో మిస్టర్ బచ్చన్ చేస్తున్నాడు. ఆ తర్వాత ఎలాగు పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh)ఉంది. సో మచ్చ రవి సినిమానే ముందుకు వెళ్లే ఆవకాశం ఉంది. కాకపోతే డైరెక్టర్ కావాలి. విశ్వంభర ఇప్పటికే సగ భాగం షూటింగ్ జరుపుకుందనే వార్తలు వస్తున్నాయి. చిరు కెరీర్ లోనే వన్ అఫ్ ది బ్లాక్ బస్టర్ హిట్ జగదేకవీరుడు అతిలోక సుందరి తరహాలో సోషియో ఫాంటసీ గా తెరకెక్కుతుంది. దీంతో చిరు అభిమానుల్లో ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఏది ఏమైనా  విశ్వంభర రిజల్ట్ తో సంబంధం లేకుండా చిరు ఇంకో మూడు చిత్రాలకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం మెగా ఫ్యాన్స్ లో జోష్ ని తెస్తుంది.