రామమందిరం బీజేపీ రాజకీయలబ్ధి కోసమేనా?

ఎంతో ప్రతిష్టాత్మక నిర్మించిన అయోధ్య రామాలయం పై కప్పు ఒక్క వర్షానికే లీక్ అవుతుంది.  ఈ సంవత్సరం జనవరి 22న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన  ఈ ఆలయానికి కేవలం ఆరునెలలకే మరమ్మతులకు రావడం ఆందోళన కలిగిస్తోంది. ఎన్నికల ముందు హడావుడి నిర్మాణం, ప్రారంభం ఏమిటని అప్పట్లోనే పరిశీలకులు విమర్శలు గుప్పించారు. బీజేపీ భక్తి రాముడి మీద కాదు.. రాజకీయ లబ్ధి మీదేనని అప్పట్లోనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు రామమందిరం గర్భగుడి లీకేజీ అప్పటి విమర్శలు నిజమేననిపించేలా ఉంది.   అయోధ్య రామాలయం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రపంచం దృష్టిని ఆకర్షించిన అయోధ్య రామాలయం గురించి ఎంతో గొప్పగా చెప్పుకునే మోదీ ఈ లీకేజిపై సమాధానం ఇవ్వాల్సిందేనన్న అభిప్రాయం వ్యక్తమౌతుంది. దీనివల్ల మోదీ ప్రభుత్వంపై అవినీతి మరకలు అంటినట్టయ్యింది. గర్బగుడి పై కప్పు ఒక్క వర్షానికే లీక్ కావడం బిజెపి వర్గాల్లో ఆందోళన వ్యక్తమౌతుంది. రామాలయంలోకి వెళ్లే 13 దారుల్లో నీరు నిలిచి పోతుంది. అయోధ్య రామాలయ నిర్మాణం ఎన్నికల స్టంట్ అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అయోధ్య రామాలయం పై కప్పు నీరు కారడం చర్చనీయాంశమైంది. 
ఉత్తర్‌ప్రదేశ్,అయోధ్యలోని రామాలయంలో గర్భగుడి పైకప్పు నుండి నీరు లీక్ అయిందని దాని ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్  తెలిపారు.
భారీ వర్షం తర్వాత ఇలా జరగడం భక్తుల్లో ఆందోళ కలిగిస్తుంది. ఆలయ నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పూజారి ఆరోపించారు.
శనివారం అర్ధరాత్రి జల్లులు పడిన తర్వాత ఆలయ ప్రాంగణం నుండి వర్షపు నీరు వెళ్లే ఏర్పాటు కూడా లేదని, అవసరమైన దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని ఆలయ అధికారులను ప్రధాన పూజారి కోరారు.
ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా ఆలయానికి చేరుకుని పైకప్పును  నిశితంగా పరిశీలించారు. 
అయోధ్య రామాలయానికి మరమ్మతులు చేసి వాటర్‌ప్రూఫ్‌గా మార్చాలని ఆదేశాలు ఇచ్చారని ఆలయ ట్రస్ట్ వర్గాలు తెలిపాయి.ఆలయ నిర్మాణ పురోగతి గురించి మిశ్రా విలేకరులతో  మాట్లాడారు.
మొదటి అంతస్తు పనులు కొనసాగుతున్నాయని, ఈ ఏడాది జూలై నాటికి పూర్తవుతాయని, డిసెంబర్ నాటికి ఆలయ నిర్మాణం పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆచార్య సత్యేంద్ర దాస్ విలేకరులతో మాట్లాడుతూ ఆలయ గర్భగుడి పైకప్పు నుండి భారీ లీకేజీ ఏర్పడింది అని అన్నారు. 
రామ్ లల్లా విగ్రహం ముందు పూజారి కూర్చునే స్థలం , విఐపి దర్శనం కోసం ప్రజలు వచ్చే ప్రదేశం నుండి నేరుగా పైకప్పు నుండి వర్షపు నీరు కారుతోంది.
జల్వాన్‌పురా నుంచి హనుమాన్‌గర్హి భక్తిపథ్‌ వరకు, తేది బజార్‌ నుంచి లోపలి ప్రాంతాల వరకు నీటి ముంపు ఎక్కువగా ఉందని స్థానికులు తెలిపారు.
వర్షం సమయంలో రాంపథ్‌లోని సందుల్లో మురుగు నీరు ఇళ్లలోకి చేరుతుంది. 
. ఇళ్ల నుండి నీటిని తొలగించడానికి మున్సిపాలిటీ సిబ్బంది నానా యాతన పడుతున్నారు. 
ఇదిలా ఉండగా, ఆలయ నిర్మాణంలో అధికార భారతీయ జనతా పార్టీ  అవినీతికి పాల్పడుతోందని కాంగ్రెస్ ఆరోపించింది..
దేశంలో విశ్వాసం , స్వచ్ఛత యొక్క చిహ్నాలు కూడా  దోచుకునే అవకాశాలు అయ్యాయని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ అన్నారు.
 బిజెపి వరుసగా మూడో పర్యాయం అధికారంలో రావడానికి రామాలయ నిర్మాణం అని విమర్శకులు అంటున్నారు.