పిన్నెల్లి పిల్లిలా బాత్రూంలో దాక్కున్నాడు!

అధికారాన్ని అడ్డుపెట్టుకుని అరాచకాలకు పాల్పడిన పిన్నెల్లి. అధికారం కోల్పోగానే పిల్లిలా మారిపోయారు. పోలీసులు అరెస్టు చేయడానికి వచ్చిన సమయంలో పిల్లిలా బాత్ రూంలో దాక్కున్నారు. ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామరెడ్డి అయితే గోడదూకి పరుగోపరుగు. సరే పిన్నెల్లిని బాత్ రూంలో నుంచి బయటకు తీసుకువచ్చి అరెస్టు చేసి కోర్టులో ప్రవేశ పెట్టారు. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది.  ఆ సంగతి పక్కన పెడితే అధికార పార్టీ ఎమ్మెల్యే గా పిన్నెల్లి పల్నాడులో చేసిన దారుణాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటి వరకూ బయటపడినవే కాకుండా ఆయన అరాచాలు  మరిన్ని ఇప్పుడు వెలుగులోకి వస్తాయని తెలుగుదేశం శ్రేణులు అంటున్నాయి.  పోలింగ్ రోజు మొదలుకుని కౌంటింగ్ రోజు వరకు పల్నాడు ప్రాంతంలో ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు అప్పటి సిట్టింగ్, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే అయిన పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి. తన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామరెడ్డితో కలిసి పిన్నెల్లి సాగించిన దురాగతాలు, దౌర్జన్యాలూ ఇన్నన్ని కావని అంటున్నారు.

 
మాచర్ల పోలింగ్ బూత్లో ఈవీఎంల ధ్వంసాన్ని అడ్డుకున్న టీడీపీ ఏజంట్ నంబూరి శేషగిరిరావు పై విచక్షణ రహితంగా దాడి చేయడం, అడ్డొచ్చిన చెరుకూరి నాగ శిరోమణి  అనే మహిళపై దుర్భాషలాడడం  పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని ప్రజల ముందు దోషిగా నిలబెట్టాయి.  ముందస్తు బెయిలు పిటిషన్లతో ఇన్నాళ్లుగా కాలం నెట్టుకొస్తున్న పిన్నేల్లికి బుధవారంతో  ఆ ఉపశమనం లేకుండా పోయింది. ఆయన  పిటిషన్లను న్యాయస్థానం కొట్టేయడంతో పిన్నెల్లి అరెస్టయ్యారు. 

ఎన్నికల ఫలితాల ముందు వరకు నన్ను టచ్ చేసి చూడడండి, నేనేంటో చూపిస్తా, అంత సీన్ ఉందా మీకు అంటూ ప్రగల్భాలు పలికిన పిన్నెల్లి ఇప్పుడు పోలీసులు తనను అరెస్టు చేయడానికి ఇంటికి వస్తే పిల్లిలా బాత్ రూంలో దాక్కున్నారు.  ఆయన సోదరుడు పిన్నెల్లివెంకట్రామిరెడ్డి అయితే గోడ దూకి పారిపోయారు.  పిన్నెల్లి అరెస్టులో పల్నాడులో జనం దిపావళి చేసుకుంటున్నారు. బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.  ఇక తెలుగుదేశం అధికార ప్రతినిథి పట్టాభి అయితే    పిన్నెల్లి సోదరుల బాధితులు   ధైర్యంగా బయటకు వచ్చి అధికారులకు ఫిర్యాదు చేయండి అని పిలుపునిచ్చారు.  దీంతో పిన్నెల్లి సోదరుల దురాగతాలు, దౌర్జన్యాలకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.