ఐదుగురు అత్యంత ధనవంతుల్లో ఒకరు విదేశాలకు
posted on Mar 27, 2025 2:23PM
విదేశాలకు వలస వెళ్లడం అంత ఆష మాషి కాదు. స్వంత గూడు వదిలి విదేశాల్లో స్థిరపడాలనుకోవడం అంత మామూలు విషయం కాదు. భారత్ లో మిత వాద రాజకీయాలు, విభజించి పాలించే రాజకీయాలు దేశంలోని అత్యంత సంపన్నులు విదేశాల్లో సెటిల్ కావడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఓ వైపు పన్నుల ఒత్తిడి , రాజకీయ కక్ష్య సాధింపు చర్యల కారణంగా మనదేశం నుంచి విదేశాలకు వలస వెళ్లే వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువైంది. వేలాది మంది కోటీశ్వరులు దేశ సరిహద్దులు దాటి పర్మినెంట్ గా విదేశాల్లో స్థిరపడాలనుకుంటున్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించి కొటక్ ప్రయివేటు ఈవై సంయుక్తంగా నిర్వహించిన సర్వే ఈ వివరాలను వెల్లడించింది. మనదేశంలోని జీవన ప్రమాణాలతో పోలిస్తే విదేశాల్లో మెరుగ్గా ఉండటంతో అక్కడ స్థిరపడాలనుకుంటున్నారు. ప్రతీయేడు 25 లక్షల మంది విదేశాలకు ఎగుమతి అవుతున్నారు. పిల్లా పాపలతో విదేశాలకు వెళ్లే వారి సంఖ్య కరోనా మహమ్మారి తర్వాత ఎక్కువైంది. స్వాతంత్రానికి పూర్వం కూడా మన దేశం నుంచి విదేశాలకు వెళ్లే సంస్కృతి ఉంది. అనేక నియమ నిబంధనలతో బాటు ఆర్థిక స్తోమత ఉన్న కుటుంబాలకు చెందిన పిల్లలు మాత్రమే విదేశాలకు వెళ్లే వారు. ప్రస్తుతం పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులే విదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అమెరికా, బ్రిటన్, కెనెడా దేశాలతో పోలిస్తే అరబ్ దేశాలకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. విదేశాల్లో పెట్టు బడులు పెట్టి వ్యాపారం చేసే సంస్కృతి వెళ్లూనుకుంది. సూపర్ రిచ్ ఇండియన్స్ కు గోల్డెన్ వీసా రావడం వల్ల పెద్దగా కష్టపడకుండానే విదేశాల్లో ఆవాసం ఏర్పాటు చేసుకోవడానికి ఆస్కారం ఏర్పడింది. గోల్డెన్ విసా అందుకున్న వారిలో ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ ఒకరు. సినిమాల నుంచి రాజకీయాలకు వెళ్లాలనుకున్న రజనీకాంత్ కి యునైటెడ్ అరబ్ ఎమ్మిరేట్స్ గోల్డెన్ విసా ఇవ్వడంతో తమ అభిమాన నటుడు భారత్ ను వదిలేస్తారా అని అభిమానులు ఆందోళన చెందారు. గోల్డెన్ విసా జాబితాలో చిరంజీవి, షారూఖ్ ఖాన్, సానియా మిర్జా, అల్లు అర్జున్ , త్రిష, మోహన్ లాల్ , మమ్ముట్టి తదితరులు ఉన్నారు. 2019లో గోల్డెన్ విసాను కేంద్ర ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసింది. ఒక రకంగా చెప్పాలంటే అత్యంత ధనవంతులకు శాశ్వత నివాస విసా అని చెప్పొచ్చు. కళాకారులకే ఉద్దేశించి గోల్డెన్ విసా ఇప్పుడు కళాకారులకు అతీతంగా సూపర్ రిచ్ ఇండియన్స్ కు వరప్రదాయినిగా మారింది. సంపన్నులు దేశం విడిచి వెళ్లిపోవటం అంటే మూలధనం తరలిపోయినట్టు అని ఆర్థిక వేత్తలు విశ్లేషిస్తున్నారు. విదేశాలకు వెళ్లడం అంటే ఫ్యూచర్ ఇన్వెస్టిమెంట్ అని వ్యాఖ్యానిస్తున్నారు. ఒక భారతీయుడు విదేశాలకు వెళ్లాలంటే రెండున్నరకోట్ల రూపాయలు తీసుకెళ్లాలి. అదే ప్రవాస భా రతీయుడైతే ఏకంగా పది కోట్ల వరకు తీసుకెళ్లవచ్చు. దీనివల్ల మన దేశంలో పెట్టు బడులు పెట్టే వారి సంఖ్య తగ్గి అభివృద్ది సూచికపై ప్రభావం పడుతుంది. నిరుద్యోగ సమస్య తాండవం చేసే అవకాశం లేకపోలేదు. మన దేశ సంపద తగ్గి విదేశాలకు సంపదను తరలించినట్టు అవుతుంది. ఒక వ్యక్తి నివాసం మారితే సంపద మారినట్టు కాదని కొటక్ మహీంద్రా ప్రెసిడెంట్ గౌతమి గవాంకర్ చెబుతున్నప్పటికీ ఆర్థిక నిపుణులు మాత్రం ఈ అభిప్రాయానికి ఏకీ భవించడం లేదు. 2023లో అల్ట్రా ఎన్ హెచ్ ఐలు 2. 83 లక్షల మంది ఉంటే వీరి సంపద విలువ నికరంగా రూ 283 కోట్లు ఉంది. 2028 వరకు వీరి సంఖ్య 4.3 లక్షలకు చేరుతుంది. వీరి సంపద రూ. 359 లక్షల కోట్లకు చేరొచ్చని సర్వే వెల్లడించింది. సర్వేలో 66.66 శాతం మంది తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. వీళ్లంతా తాము విదేశాలకు వెళ్లేందుకు ఆసక్తికనబరిచిన వారే కావడం గమనార్హం.