లగడపాటి పుట్టి మునుగుతోందంట!
posted on Sep 9, 2012 11:30AM
.jpg)
విజయవాడ లోక్‌సభ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ చాలా సమస్యలతో సతమతమవుతున్నారు. ల్యాంకో గ్రూప్ ప్రస్తుతం ఆర్ధిక సమస్యల్లో చిక్కుకుంది. రాజగోపాల్ రాకీయాల్లోకి వచ్చిన తర్వాత ల్యాంకో నిర్వహణా బాధ్యతలను తన తమ్ముడైన మధుసూధన్‌కు అప్పగించారు, మొదట్లో మధుసూధన్ చాలా స్పీడ్‌గా నిర్ణయాలు తీసుకుంటూ టర్నోవర్‌ను సుమారు 20 రెట్లు పెంచారు. దేశంలో పలు చోట్ల మెగా పవర్ ప్రాజెక్టులు నెలకొల్పారు. ఇదే స్పీడ్‌తో ఆయన తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాజగోపాల్‌కి సమస్యలు తెచ్చిపెట్టిందని విశ్వసనీయవర్గాల సమాచారం. దేశంలో నెలకొల్పుతున్న , నెలకొల్పిన పవర్ ప్రాజెక్టులకు బొగ్గు అవసరాలను తీర్చేందుకు వెస్ట్రన్ ఆస్ట్రేలియాలోని పెర్త్ వద్ద గ్రిఫిన్ కోల్ మైన్స్‌ను కొనుగోలుచేశారు. అలవాటు ప్రకారం మన దేశంలో చేసినట్లే అక్కడ కూడా నిబంధనలు ఉల్లంఘించడంతో పర్ధిమాన్ ఫెర్టిలైజర్స్ అనే ఆస్ట్రేలియా కంపెనీ ల్యాంకో ఇన్‌ఫ్రాపై 14 వేల కోట్ల రూపాయల పరిహారానికి దావా వేసింది. ఆ కేసు వేసిన వెంటనే ల్యాంకో ఇన్‌ఫ్రా షేరు ధర 60 రూపాయల నుంచి 13 రూపాయలకు పడిపోయింది. కంపెనీ నష్టాలు సుమారు ఐదు వందల కోట్లకు చేరుకున్నాయి. దీంతో రాజగోపాల్ కి చుక్కలు కనిపించాయ్. ఇప్పుడు కంపెనీ వ్యవహారాతనే స్వయంగా చూసుకుంటున్నారు. వెస్ట్రన్ ఆస్ట్రేలియా కోర్టులో ఉన్న కేసులో ల్యాంకో వాదనలు చాలా బలహీనంగా ఉన్నాయని ఈ కేసులో వోడిపోతే ల్యాంకో గ్రూప్ మొత్తం సంక్షోభంలో పడడం ఖాయమని తెలుస్తోంది. దీనికి తోడు ల్యాంకో ఇప్పటికే నెలకొల్పిన ధర్మల్ విద్యుత్ ప్రాజెక్టులకు తగినంతస బొగ్గు సరఫరా లేక పూర్తి స్ధాయిలో విద్యుత్ ఉత్పత్తి చేయలేకపోతున్నాయి.