చిన్నశ్రీను, విజయనగరంలో పెద్ద డాన్
posted on Sep 9, 2012 11:34AM
.jpg)
బొత్స చిన్నశ్రీను అంటే విజయనగరం వెలుపల ఎవరికి పెద్దగా తెలీదు. కాని అతని పేరు వింటేనే విజయనగరం గజగజలాడుతుంది. చిన్న శ్రీను చిన్న చిటికేస్తే ఐ.ఎ.ఎస్.లు, ఐ.పి.ఎస్.లు కూడా ఫ్యాంట్ తడుపుకోవాల్సిందే. అతని కను సన్నల్లోనే పారిశ్రామిక వేత్తలు , వ్యాపారులు మెలగాలి. తెలిసో తెలియకో తలగరేసినవాళ్లు తర్వాత తలదించుకుని ఆయన ముందు గంటల కొద్దీ పడిగాపులు కాయాల్సొస్తుంది. ఆయన్ను అంతా షాడో మినిస్టర్ అంటారు. మినిస్టర్ అనే మాట ఎందుకొచ్చిందంటే చిన్న శ్రీను స్వయానా రాష్ట్రమంత్రి , పి.సి.సి ఆధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు మేనల్లుడు. బిటెక్ చదివిన చిన్న శ్రీను జిల్లా ఆధికార యంత్రాంగాన్ని పూర్తిగా చెప్పుచేతల్లో పెట్టుకున్నాడు. కలెక్టర్ తో సహా ఉద్యోగులంతా శ్రీను డాన్ కి దాసోహమనాల్సిందే. జిల్లా కలెక్టర్ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా, ముఖ్యమైన ఫైళ్ళపై సంతకాలు చేయాలన్నా చిన్న శ్రీను అనుమతి తీసుకోవాల్సిందే. జిల్లాలో ఎవరైనా పరిశ్రమలు పెట్టాలంటే ముందుగా చిన్న శ్రీనును ప్రసన్నం చేసుకోవాలి. లేకపోతే వారికి తిప్పలు తప్పవు. ఇటీవల కొందరు ఎన్.ఆర్.ఐ.లు జిల్లాలో పరిశ్రమ పెట్టడానికి భూమి కొనుగోలు చేశారు. చిన్నశ్రీనును కలుకోవాలన్న కామన్‌సెన్స్ వీరికి లేకపోవడంతో అడుగడుగున్నా ఇబ్బందులు పెట్టారు. ఒక్క సారి చిన్న శ్రీనును కలుసుకోండంటూ జిల్లా ఉన్నతాధి కారి ఇచ్చిన సలహాను కూడా ఈ ఎన్.ఆర్.ఐ.లు పెడచెవిన పెట్టారు. దీంతో పబ్లిక్ హియరింగ్ సమయంలో చిన్న శ్రీను అదును చూసి కొట్టిన దెబ్బతో వారికి ఙ్నానోదయం అయింది. చిన్న శ్రీను పెద్దడాన్‌లా వ్యవహరిస్తున్నారని కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చినప్పటికి ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. బొత్స సత్యనారాయణ కూడా తన ప్రియమైన మేనల్లుడి బాల చేష్టల్ని వినోదంగా చూస్తూ ఆనందిస్తుంటారు.