నన్ను ఎవరు భయపెట్టలేరు.. నేను కూడా తెలుగు వాడ్నే

రెండున్నర దశాబ్దాలుగా తెలుగు సిల్వర్ స్క్రీన్ పై తన సత్తా చాటుతు వస్తున్న తమిళ స్టార్ హీరో సూర్య(suriya)ఈయన తమిళ నటుడని అన్నా కూడా తెలుగు ప్రేక్షకులు నమ్మని పరిస్థితి. తమిళంలో ప్లాప్ అయిన చాలా  సినిమాలు  టాక్ తో సంబంధం లేకుండా  తెలుగు నాట మంచి కలెక్షన్స్ ని రాబడతాయి.కొన్ని నెలల క్రితం  2008 లో వచ్చిన  సూర్య ఓల్డ్ మూవీ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ ని తెలుగులో  సెకండ్ రిలీజ్ చేసారు. చాలా థియేటర్స్ లో  స్క్రీన్ ముందుకెళ్లి  డాన్స్ లు వేస్తు సూర్య మీద ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.దీన్ని బట్టి  తెలుగు ప్రేక్షకుల్లో  సూర్యకి ఉన్న స్టామినాని అర్ధం చేసుకోవచ్చు. తాజాగా ఆయన కొత్త చిత్రానికి సంబంధించిన  రిలీజ్ డేట్ పాన్ ఇండియా సినీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయ్యింది.

సూర్య అప్ కమింగ్ మూవీ  కంగువా(kanguva)ఫాంటసీ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంటుండగా  ఎంటైర్ సూర్య సినీ కెరీర్లోనే   మోస్ట్  ప్రెస్టేజియస్ట్  ప్రాజెక్ట్ గా  తెరకెక్కుతుంది. సూర్య గెటప్ ని రిలీజ్ చేసిన దగ్గరనుంచే పాన్ ఇండియా ప్రేక్షకులు కంగువా అప్ డేట్స్ మీద ఒక కన్ను వేసి ఉంచారు. ఇక కొన్ని నెలల క్రితం రిలీజ్ అయిన టీజర్ తో సూర్య అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని అంటాయి. రిలీజ్ ఎప్పుడెప్పుడా అని అనుకుంటున్నారు, ఇప్పుడు వాళ్లందరికి గుడ్ న్యూస్. కంగువా రిలీజ్ డేట్ వచ్చింది. వరల్డ్ వైడ్ గా  దసరా కానుకగా అక్టోబర్ 10 న విడుదల కాబోతుంది. ఈ మేరకు మేకర్స్ అధికారంగా ప్రకటించారు. గోపి చంద్ తో శంఖం, శౌర్యం, రవితేజ తో దరువు కి దర్సకత్వం వహించిన   శివ(siva)ఈ సినిమాకి  దర్శకుడు. అజిత్ తో వీరం, వేదాళం, వివేగం, విశ్వాసం, రజనీతో అన్నాతే  కూడా చేసాడు. దీంతో కంగువా మీద అందరిలో భారీ  అంచనాలు ఉన్నాయి.

ఇక సూర్య అక్టోబర్ 10 న రావడం ఇప్పుడు సౌత్ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే సూర్య సినిమా తమిళంతో పాటు తెలుగులో కూడా భారీగానే విడుదల అవుతుంది. బిజినెస్ రేంజ్ కూడా ఆ విధంగానే జరుగుతుంది. మరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సెప్టెంబర్ 27 న వరల్డ్ వైడ్ గా  రిలీజ్ కాబోతుంది. అక్టోబర్ 10 కి సెప్టెంబర్ 27 కి కేవలం రెండు వారాల తేడా మాత్రమే ఉంది. అదే విధంగా  రామ్ చరణ్ గేమ్ చేంజర్ కూడా అక్టోబర్ లో వచ్చే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. ఇవే  కాకుండా మరిన్ని భారీ సినిమాలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాకపోతే  ఈ విషయాలన్నీ కంగువా మేకర్స్ కి తెలియనవేమి కాదు. సో ఎవరు ఉన్నా తెలుగు ప్రేక్షకులు తనని ఆదరిస్తారనే నమ్మకంతోనే సూర్య  వస్తున్నాడన్న మాట. దిశా పటాని హీరోయిన్ గా చేస్తుండగా  బాబీ డియోల్ విలన్ గా చేస్తున్నాడు. జగపతి బాబు, నటరాజన్ సుబ్రహ్మణ్యం, యోగిబాబు ఇతర  ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.