ప్రభాస్ ఫస్ట్ డే కలెక్షన్స్ అమెరికావా లేక అనకాపల్లివా.. డార్లింగ్  ఇదేం రికార్డు  

 

వాతావరణ శాఖ చెప్పినా చెప్పకపోయినా తుఫాన్ ఆగదు.  ఆ తర్వాత  దాని దాటికి అందరు తలొగ్గాల్సిందే.  ఇప్పుడు ప్రభాస్ (prabhas)కల్కి 2898 ఏడి(kalki 2898 ad) పరిస్థితి కూడా అలాగే ఉంది. అదిరిపోయే కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంది. దాంతో గత చిత్రాల రికార్డులన్నీ తమంతట తాముగా  తప్పుకుంటున్నాయి.

ఇండియా వైడ్ గా జూన్ 27 న విడుదలైన  కల్కి  ఓవర్ సీస్ లో మాత్రం ఒక రోజు  ముందుగానే విడుదల అయ్యింది. అంటే జూన్ 26 న  అక్కడి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  రిలీజ్ కి ముందే  అడ్వాన్స్ బుకింగ్ లో సరికొత్త రికార్డులు కూడా నెలకొల్పింది. కల్కి ప్రభంజనం గురించి  ఒక  ఉదాహరణగా చెప్పుకోవాలంటే  నార్త్ అమెరికాలో ప్రీమియర్ షోస్ లకి సంబంధించి ఫస్ట్ డే  3 .8 మిలియన్ డాలర్ల  గ్రాస్ ని సాధించింది. మన ఇండియన్ కరెన్సీ లో చెప్పాలంటే  30 కోట్లు పైనే.  దీంతో ఎంటైర్ భారతీయ చిత్ర పరిశ్రమలోనే నార్త్ అమెరికాలో  హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన ఫస్ట్ మూవీగా  కల్కి  చరిత్ర సృష్టించింది. ఇప్పుడు ఈ కలెక్షన్స్ తో అది అమెరికానా లేక అనకపల్లినా అనుకునే పరిస్థితి.

అదే విధంగా  కల్కి ద్వారా  ప్రభాస్ కట్ అవుట్ కి ఉన్న స్టామినా ఏంటో మరోసారి అందరకి అర్థయ్యింది. ఆర్ఆర్ఆర్ (rrr)3 .46 మిలియన్స్ తో సెకండ్ ప్లేస్ లో ఉండగా   సలార్ (salaar) 2 .6 మిలియన్స్ , బాహుబలి 2  2 .45 , కబాలి 1 .92 , లియో 1 .86 మిలయన్స్ తో  తర్వాతి స్థానాల్లో   ఉన్నాయి.కల్కి ఫీవర్ ఇప్పట్లో తగ్గదు కాబట్టి మరిన్ని రికార్డులని తన ఖాతాలో చేరే  అవకాశం ఉంది.