‘గురువాయుర్ అంబలనాదయిల్’ మూవీ రివ్యూ!

 

మూవీ : గురువాయుర్ అంబలనాదయిల్
నటీనటులు: బసిల్ జోసెఫ్, పృథ్విరాజ్ సుకుమారన్
రేఖ, నిఖిలా విమల్, అనస్వర రాజన్, యోగి బాబు తదితరులు
ఎడిటింగ్: జాన్ కుట్టీ
మ్యూజిక్: అంకిత్ మీనన్
సినిమాటోగ్రఫీ: నీరజ్ రేవి
నిర్మాతలు: సుప్రియ మీనన్, ముఖేశ్ ఆర్. మెహతా, 
దర్శకత్వం: విపిన్ దాస్
ఓటీటీ: డిస్నీ ప్లస్ హాట్ స్టార్

కథ: 

ఈ కథ కేరళలోని గురువాయుర్ ఆలయంలో మొదలవుతుంది. అంజలి వాళ్ళ అన్నయ్య ఆనందన్ దుబాయ్ లో ఉంటున్న 'విను' తో పెళ్ళి నిశ్చయం చేస్తాడు. అయితే అంతకముందే వినుకి పెళ్ళి జరిగిందని తను మోసం చేసి వెళ్ళిపోయిందని తన పేరు పార్వతీ అని ఆనంద్ తో విను చెప్తాడు. ఇక అతని భాదని తట్టుకోలేక తన సొంత చెల్లి అంజలితో విను పెళ్ళి ఫిక్స్ చేస్తాడు ఆనంద్. అయితే విను, ఆనంద్ ల మధ్య బాండింగ్ కృష్ణార్జునుల బంధమని ఇద్దరు అనుకుంటూ మురిసిపోతారు. ఇక విను పెళ్లి కోసం దుబాయ్ నుండి కేరళకి వస్తాడు. ఇక వచ్చిన తర్వాత ఆనంద్ మాజీ ప్రేమికురాలు గురించి తెలుసుకుంటాడు విను. ఎలాగైనా వారిని కలపడానికి ఆనంద్ కి విను కొన్ని కవితలు, మంచిమాటలు చెప్పి పంపిస్తాడు. ఇక ఆ అమ్మాయి కన్విన్స్ అయి ఆనంద్ తో పాటు వస్తుంది. ఇక అదే సమయంలో విను కూడా ఆనంద్ కి సర్ ప్రైజ్ ఇస్తూ వారి ఇంటికి వస్తాడు. ఇక అప్పుడే పార్వతిని విను చూస్తాడు.‌ అదేసమయంలో ఆనంద్ ప్రేమించిన అమ్మాయి పార్వతీనే అని వినుకి తెలుస్తుంది. మరి విను, అంజలీల పెళ్ళి జరిగిందా? నిజం తెలుసుకున్న విను పార్వతి గురించి ఆనంద్ కి చెప్పాడా లేదా అనేది మిగతా కథ.

విశ్లేషణ:

ఈ మధ్యకాలంలో మలయాళం నుండి వచ్చిన సినిమాల్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని చెప్పొచ్చు అనేలా కథనం సాగుతుంది. మొదటి నుండి చివరి వరకు కామెడీతో పాటు ఎంటర్‌టైన్మెంట్ ని ఇస్తుంది. కథలో వచ్చే ట్విస్ట్ లు సినిమాకి మరింత బలాన్ని చేకూర్చాయి.

అడల్ట్ సీన్లు ఎక్కడ లేవు. అశ్లీల పదాలు లేకుండా చాలా జాగ్రత్త పడ్డారు. సినిమాలో విను, ఆనంద్ పాత్రలని చూస్తుంటే నిజంగా బెస్ట్ ఫ్రెండ్స్ లా కనిపిస్తారు. అయితే దుబాయ్ నుండి కేరళకి వచ్చాక అనంద్ ని లైవ్ లో విను చూసాక వచ్చే సంభాషణలు నవ్వు తప్పిస్తాయి. ఇక తెలుగు డబ్బింగ్ కూడా చక్కగా కుదిరింది. పాటలు ఉన్నంతలో నీట్ గా అలా వచ్చి వెళ్ళాయనిపిస్తుంది.

సందర్భానుసారంగా వచ్చే పాత్రలు కూడా పరిధి మేరకే ఉన్నాయి. నిడివి కూడా పెద్ద సమస్యే లేదన్నట్టుగా కథనం సాగుతుంది. ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా వీకెండ్ కి ఫ్యామిలీతో కలిసి చూసేలా మేకర్స్ తీర్చిదిద్దారు. మన ఫ్యామిలీతో కలసి ఓ పెళ్లిని చూడటానికి వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉంది. అయితే సెకెంఢాఫ్ కాస్త స్లో అయినా.. పృథ్విరాజ్, బసిల్ జోసెఫ్ ల పర్ఫామెన్స్ అలా నిలబెట్టేసింది. యోగిబాబు కామెడీ పర్వాలేదు. మ్యూజిక్ బాగుంది. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.


నటీనటుల పనితీరు:

విను పాత్రలో బసిల్ జోసెఫ్, ఆనంద్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్, పార్వతీగా నిఖిలా విమల్, అంజలిగా అనస్వర రాజన్ ఒదిగిపోయారు. ప్రతీ ఒక్కరు తమ పాత్రలకి న్యాయం చేశారు.

ఫైనల్ గా : ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూసే కామెడీ ఎంటర్‌టైనర్. 

రేటింగ్ :  2.75 / 5

✍️. దాసరి మల్లేశ్