లండన్ హిత్రూ ఎయిర్ పోర్ట్ క్లోజ్డ్.. ఎందుకంటే..?
posted on Mar 21, 2025 2:03PM

ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఒకటైన లండన్‌లోని హీత్రూ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానరాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. విమానాశ్రయం సబ్ స్టేషన్ లో సంభవించిన భారీ అగ్ని ప్రమాదమే ఇందుకు కారణం. సబ్ స్టేషన్ లో సంభవించిన అగ్ని ప్రమాదం కారణంగా విద్యుత్ కు అంతరాయం ఏర్పడింది.
దీంతో విమానాశ్రయంలో విమానరాకపోకలను నిలిపివేశారు. దీంతో లండన్ వెళ్లాల్సిన పలు విమానాలు వివిధ విమానాశ్రయాలలో నిలిచిపోయాయి. ఎయిర్ ఇండియా కూడా లండన్ కు వెళ్లే విమాన సర్వీసులను నిలిపివేసింది. హీత్రూ నుండి లండన్ హీత్రూ విమానాశ్రయంలో విద్యుత్తు అంతరాయం ప్రపంచవ్యాప్తంగా 1300 విమానాల రాకపోకలపై ప్రభావం చూపింది. హిత్రూ విమానాశ్రయంలో విమనరాకపోకలను ఎప్పటిలోగా పునరుద్ధరించేది ఇంకా అధికారికంగా వెళ్లడించలేదు.