డ్రగ్స్ కేసులో ముగ్గురు ఇండియన్స్ కు మరణ శిక్ష?
posted on Mar 21, 2025 1:12PM

డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో ముగ్గురు ఇండియన్స్ కు మరణ శిక్ష విధించే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడుతున్నాయి. నిరుడు జులైలో సింగపూర్ ప్లాగ్ ఉన్న ఓడలో నిషేధిత డ్రగ్ అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు భారతీయుల సమాచారం ఇండో నేషియా పోలీసులకు అందింది. వెంటనే రైడ్స్ చేయడంతో 106 కిలోల గంజాయి మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.
తమిళనాడుకు చెందిన రాజు ముత్తుకుమారన్ , సెల్వదురై దినకరన్, విమల కందన్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ ముగిసింది తీర్పు రిజర్వ్ చేశారు. ఏప్రిల్ 15న ఇండోనేషియా కోర్టు తీర్పు వెలువడనుంది. ఇండియన్స్ తరపున జాన్ పాల్ కేసు వాదిస్తున్నారు. ఓడ కెప్టెన్ కు తెలియకుండా మాదక ద్రవ్యాలను ఓడలో దాచిపెట్టినట్లు ఈ ఇండియన్స్ పై ఆరోపణలున్నాయి.
కెప్టెన్ అనుమతితో మాదక ద్రవ్యాలను ఓడలో దాచిపెట్టినట్టు నిందితుల తరపు న్యాయవాది వాదించారు. ముగ్గురు భారతీయులకు మరణ శిక్ష విధించే అవకాశం మెండుగా ఉంది. ప్రస్తుతం ఈ ముగ్గురు ఇండియన్స్ ఇండోనేషియా జైల్లో ఖైదీలుగా ఉన్నారు.