గజగజలాడుతున్న ఉత్తర భారతం
posted on Dec 15, 2023 8:25AM
ఉత్తర భారతం చ లిపులి గుప్పెట్లో చిక్కుకుంది. రోజురోజుకూ తగ్గుతున్న ఉష్ణోగ్రతలకు తోడు భారీగా మంచు కురుస్తుండటంతో జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఢిల్లీ, ఉత్తరాఖండ్, జమ్మూకాశ్మీర్, సిక్కిం తదితర రాష్ట్రాలలో చలి తీవ్రత అధికమైంది. భారీగా మంచుకురుస్తుండటంతో తూర్పు సిక్కింలో 1200 మందికి పైగా పర్యాటకులు చిక్కుకుపోయారు. ఆర్మీలోని త్రిశక్తి దళాలు వారిరి ప్రత్యేక ఆపరేషన్ ద్వారా బయటకు తీసుకువచ్చి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తూర్పు సిక్కింలో చిక్కుకుపోయిన పర్యాటకులలో చిన్నపిల్లలు, మహిళలు, వయోవృద్ధులూ కూడా ఉన్నట్లు ఆర్మీ తెలిపింది. చలీ తీవ్రత తట్టుకోలేక వారిలో పలువురు స్ఫృహకోల్పోయారనీ పేర్కొంది. సురక్షిత ప్రాంతాలకు తరలించిన పర్యాటకులకు ఆహారం, వైద్యం అందిస్తున్నట్లు వివరించింది.