హైదరాబాద్ లో వంశీ ఇంట్లో పోలీసుల సోదాలు
posted on Feb 15, 2025 1:03PM
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంట్లో ఎపి పోలీసులు సోదాలు చేస్తున్నారు. హైద్రాబాద్ రాయదుర్గంలోని ఆయన ఇంట్లో వంశీ సెల్ ఫోన్ కోసం సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ సెల్ ఫోన్ దొరికితే అనేక విషయాలు వెలుగు చూడనున్నాయి. ఇప్పటికే ఈ కేసులో వంశీ అసిస్టెంట్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. వంశీ కస్టడీ కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్ లో కూడా ఆయన వాడే సెల్ ఫోన్ ప్రస్తావన ఉంది. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ ప్రధాన నిందితుడు. ప్రస్తుతం ఈ కేసులో వంశీ అరెస్టయ్యాడు.
హైద్రాబాద్ లో వంశీని అరెస్ట్ చేసే సమయంలో కూడా ఈ సెల్ ఫోన్ దొరకలేదు. కేసు దర్యాప్తులో ఈ సెల్ ఫోన్ కీలకం కానుంది.