అయోధ్య ఆలయపూజారి పార్థివదేహం.. సరయు నదిలో జల సమాధి..

అయోధ్య ఆలయ ప్రధాన పూజారి ఆచార్యసత్యేంద్ర దాస్ భౌతిక కాయాన్ని సరయు నదిలో జలసమాధి చేశారు. ఆయన రెండు రోజుల కిందట అంటే బుధవారం (ఫిబ్రవరి 13)న శివైక్యం చెందిన సంగతి తెలిసిందే. అయోధ్య ఆలయ నిర్మాణంలో మొదటి ఇటుకను పేర్చిన ఆచార్య సత్యేంద్ర దాస్ 85 ఏళ్ల వయసులో పరమపదించారు.

అంతకు ముందు వారం రోజుల కిందటే ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. చికిత్స పొందుతూ బుధవారం (ఫిబ్రవరి 13) కన్ను మూశారు.  ఆయన భౌతిక కాయాన్ని అయోధ్యలోని  సరయూ నదిలో జల సమాధి చేశారు. పడవలో సత్యేంద్ర దాస్ పార్థివ దేహాన్ని తీసుకెళ్లి  నదిలో వేశారు.