ఢిల్లీలో రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి భేటీ

తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ  పూర్తి అయిన నేపథ్యంలో  వాటి గూర్చి రాహుల్ కు వివరిస్తున్నట్టు సమాచారం. తెలంగాణలో భారీబహిరంగ సభలకు రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. ఎంఎల్ సి ఎన్నికల ముందు ఈ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తే పార్టీకి ప్రయోజనం చేకూరుతుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. సూర్యాపేటలో బిసి కుల గణన,  మెదక్ లో ఎస్సీ వర్గీకరణ  భారీ బహిరంగసభలు ఏర్పాటు చేసే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది.