పాఠ్య పుస్తకాల్లో హీరోయిన్ తమన్నా జీవిత చరిత్ర... పాకిస్థాన్ నుండి వచ్చిందిగా 

క్లాస్ రూమ్ కి టీచర్ వచ్చింది. నిన్న చదువుకురమ్మన్న పాఠం చదివారా అని పిల్లలని అడిగింది. చదివాం మేడం అని చెప్పారు.  ఏం చదివావో చెప్పమని ఒక పిల్లవాడ్ని అడిగింది. అప్పుడు అతను సినిమా ఇండస్ట్రీ లో తమన్నా  చాలా కష్టపడి పైకొచ్చింది. యాక్టింగ్ లోను, డాన్స్ లోను హీరోలకి ధీటుగా చేస్తుంది. ముఖ్యంగా గ్లామర్ రోల్స్ లోను అదరగొడుతుందని చెప్పాడు.దీంతో గుడ్ అంటూ టీచర్  పొగిడింది. ఒక గిఫ్ట్ కూడా ఇచ్చింది. అదేంటి సినిమా వాళ్ళ గురించి చెప్తే  అలా చేసింది. అసలు క్లాస్ రూమ్ లో ఆ చర్చ ఏంటి..అసలేం  జరుగుతుందని అంటారా! సరే అసలు విషయం చూద్దాం.

కర్ణాటక లోని ఒక స్కూల్ లో తమన్నా (tamannaah)జీవిత చరిత్ర గురించి పాఠ్యాంశంగా చేర్చారు.ఏంటి ఇది  నిజమేనా సరాదాగా చెప్తున్నారా అని అనుకోకండి. నూటికి నూరు శాతం నిజం.బెంగళూరు నగరంలోని హెబ్బళ సింధీ ఉన్నత పాఠశాలలో  7వ తరగతి పుస్తకాల్లో తమన్నా జీవిత కథని పాఠ్యాంశంగా చేర్చారు.  దీంతో విద్యార్థుల తల్లితండ్రులు  ఫైర్ అవుతున్నారు. సినిమాల్లో అర్ధ నగ్నంగా నటించే తమన్నా గురించి పిల్లలు చదవడమేంటని ప్రశ్నిస్తున్నారు. కానీ స్కూల్ యాజమాన్యం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తమన్నా జీవిత చరిత్ర గురించి ఉండాల్సిందే  అంటున్నారు. సింధీ వర్గానికి చెందిన తమన్నా సినీ రంగంలో ఎన్నో విజయాలు సాధించిందని అందుకే  అలా  చేశామని అంటుంది. 

 సింధీ  వర్గం వారు  హిందూస్ వర్గానికి చెందిన వారే. భారతదేశంలో నివసిస్తున్న సింధీ హిందువులలో అత్యధికులు లోహనా జాతికి చెందినవారు, ఇందులో అమిల్, భైబంద్ మరియు సాహితీ ఉప సమూహాలు. 1947లో భారతదేశ విభజన తర్వాత, పాకిస్తాన్ నుండి భారతదేశ ఆధిపత్యానికి పారిపోయిన వారిలో చాలా మంది సింధీ హిందువులు ఉన్నారు, కొన్ని ప్రాంతాలలో హిందూ మరియు ముస్లిం జనాభా టోకు మార్పిడి జరిగింది. కొంతమంది మాత్రం  భారత ఉపఖండం నుండి వలస వచ్చి ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో స్థిరపడ్డారు. ప్రముఖ బాలీవుడ్ హీరో  రణవీర్ సింగ్ కూడా సింధీ నే. ఆయన  జీవిత చరిత్రని కూడా చేర్చారు.తమన్నా పూర్తి పేరు తమన్నా భాటియా. 1989 డిసెంబర్ 21 న ముంబై లో జన్మించింది. 2005 లో మంచు మనోజ్ హీరోగా వచ్చిన శ్రీ ఆమె మొదటి సినిమా. ఇప్పటి వరకు అన్ని భాషల్లో కలుపుకొని 68  చిత్రాలకి పైగానే చేసింది.