డాక్టర్ ప్రణీత ఆత్మహత్యాయత్నం ...అత్తింటి వేధింపులే కారణం

తన అత్తింటి వాళ్ల వేధింపులు తట్టుకోలేక హైద్రాబాద్ కర్మన్ ఘాట్  చంపాపేట కు చెందిన గైనకాలజిస్ట్  డాక్టర్ ప్రణీత ఆత్మహత్యాయత్నం చేసింది. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసి తల్లికి పంపించింది. 2018లో డాక్టర్ ప్రణీత  సాప్ట్ వేర్ ఇంజినీర్ సికిందర్ తో సాంప్రదాయబద్దంగా పెద్దల సమక్షంలో  వివాహం జరిగింది.  వివాహంతర్వాత వీరిరువురు అమెరికాలో ఉన్నారు.   ఇటీవల హైద్రాబాద్ వచ్చారు. అప్పట్నుంచి వరకట్న వేధింపులు ఎక్కువయ్యాయి. అత్తింటివాళ్లు కొట్టడంతో మనస్థాపం చెందిన ప్రణీత ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రస్తుతం చావు బతుకుల మధ్య ప్రణీత కొట్టు మిట్టాడుతోంది.