విశాఖ ఎర్రమట్టిదిబ్బల తవ్వకాలపై  స్టే కొనసాగింపు 

విశాఖలో  సహజ సిద్దమైన ఎర్రమట్టి దిబ్బల తవ్వకాలను నిలుపదల చేస్తూ ఎపి హైకోర్టు విధించిన స్టే గడువు మరో నాలుగు వారాలు పొడిగించింది. బుధవారం ఈ కేసు విచారణ జరిగింది. గతంలో జనసేన కార్పోరేటర్ మూర్తియాదవ్ దాఖలు చేసిన పిటిషన్ పై  హైకోర్టులో విచారణ  జరిగింది. అక్రమ తవ్వకాలను నిలుపదల చేస్తూ గతంలో కోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ ను మరో నాలుగువారాలకు పొడిగించింది.