ప్రయాగ్ రాజ్ లో అగ్నిప్రమాదం.. ఏడు టెంట్లు దగ్ధం
posted on Feb 16, 2025 5:57AM
.webp)
ఉత్తర ప్రదేశ్ ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. 144 ఏళ్లకు ఒక సారి వచ్చే మహా కుంభ మేళా ఈ నెల 29తో ముగియనుంది. ఈ నేపథ్యంలో దేశం నలుమూలల నుంచీ భక్తులు వెల్లువలా తరలి వస్తున్నారు. అదే సమయంలో ప్రయాగ్ రాజ్ లో అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలమౌతున్నారు.
గత నెల 29న తొక్కిసలాట జరిగి 30 మంది భక్తులు మరణించారు. అలాగే కుంభమేళాలో ఇప్పటికే రెండు సార్లు అగ్ని ప్రమాదాలు జరిగాయి. తాజాగా శనివారం సాయంత్రం కుంభమేళాలో మరో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో ఏడు టెంట్లు దగ్ధమయ్యాయి. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కుంభమేళా ప్రాంతంలోని ఓ స్టోర్ రూంలో చెలరేగిన మంటలు పక్కనున్న టెంట్లకు కూడా వ్యాపించాయి.అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.