ఢిల్లీ హైకోర్టు లో కవితకు చుక్కెదురు.

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ హైకోర్టు కవితకు బెయిలు నిరాకరించింది.  ఈడీ, సీబీఐ... రెండు కేసుల్లోనూ ఆమె బెయిల్ పిటిషన్లను హైకోర్టు తిరస్కరించింది. మద్యం పాలసీ కేసులో మొదట ఈడీ, ఆ తర్వాత సీబీఐ  కవితను అరెస్టు చేసిన సంగతి విదితమే.  

ఈ రెండు కేసుల్లోనూ కవిత బెయిల్ కోరుతూ దాఖలు చేసిన రెండు పిటిషన్లనూ ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఈ పిటిషన్లపై సీబీఐ, ఈడీ వాదనలతో   ఢిల్లీ హైకోర్టు ఏకీభవించడంతో కవితకు భంగపాటు తప్పలేదు.  

తొలుత ఈ కేసుల్లో  కవిత రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. అక్కడ బెయిల్ రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు.  అక్కడ కూడా ఆమెకు చుక్కెదురు కావడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించే  ఉద్దేశంలో ఉన్నట్లు తెలుస్తోంది.