తెలంగాణలో 67 కేసులు నిజామాబాద్‌లో హై అలర్ట్!

తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య శ‌ర‌వేగంగా పెరుగుతోంది.  నిజామాబాద్ పట్టణంలోని ఖిల్లా రోడ్డులోని ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. 60 ఏళ్ల ఆయన ఈ నెల 12న ఢిల్లీ నుంచి తిరిగొచ్చారు. కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయన్ను ఈ నెల 15న హాస్పిటల్‌లో చేర్పించారు. టెస్టులు చేయగా ఆయన కోవిడ్ పాజిటివ్ అని తేలింది. దీంతో నిజామాబాద్‌లో హై అలర్ట్ ప్రకటించారు. తెలంగాణలో 67 మందికి కోవిడ్ సోకిందని మంత్రి ఈటల ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులతోపాటు కాంటాక్ట్ అయిన పది మందిని క్వారంటైన్‌కు తరలించారు. మార్చి 12-15 తేదీల మధ్య ఆయన ఇంకా ఎవరినైనా కలిశారా? ఏదైనా హాస్పిటల్‌కు వెళ్లారా అనే దిశగా ఆరా తీస్తున్నారు.   

ఇప్పటి వరకూ హైదరాబాద్ పరిసర ప్రాంతాలతోపాటు భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్ జిల్లాల్లో కరోనా కేసులు నమోదు కాగా శ‌నివారంనాడు నిజామాబాద్‌లోనూ కోవిడ్ కేసు నమోదైంది.

భద్రాద్రి కొత్తగూడెంలో నలుగురికి కరోనా సోకింది. వీరిలో ఒకరు అశ్వాపురం చెందిన వారు కాగా.. మరొకరు కొత్తగూడెం డీఎస్పీ కుమారుడు. ఆయన ద్వారా డీఎస్పీకి, ఇంట్లో వంట మనిషికి కూడా కరోనా సోకింది.