200 ఏళ్ల తర్వాత  బ్రిటీష్‌ను పరిపాలిస్తోన్న ఇండియ‌న్స్‌..! 

బ్రిటీషుకు కరోనాదెబ్బ త‌గ‌ల‌డంతో ఆ దేశ‌ప‌గ్గాలు ఇండియ‌న్స్ చేతికి వ‌చ్చాయి. 200 సంవత్సరాలు బ్రిటిష్ వారు ఇండియా ని పాలించారు.. అని విన్నాం. 200ఏళ్ల తర్వాత ఇండియన్ బ్రిటిష్ ని పాలించ బోవడం చూడబోతున్నాం. రాణి, రాజు, ప్రధాని, ఆరోగ్య మంత్రి అందరూ కరోనా బారిన పడ్డారు. ఇప్పుడు బ్రిటన్ పగ్గాలు, ఫైనాన్స్ మినిస్టర్ రిషి సునక్, హోమ్ మినిస్టర్ ప్రీతి పటేల్, బిజినెస్ మినిస్టర్ అలోక్ శర్మ గారి చేతుల్లో పడ్డాయి.. అది విష‌యం.
 
ఇప్పుడు బ్రిటన్‌లో భార‌తీయుల‌దే పెత్త‌నం. పరిస్థితి చూస్తుంటే అలానే ఉంది మరి. దాదాపు 200 సంవత్సరాల పాటు భారత్‌ను తమ చేతుల్లో పెట్టుకొని.. మన దేశ సంపదనంతా దోచుకోవడంతో పాటు ఎంతోమంది అమాయకపు ప్రజల ప్రాణాలను పొట్టనపెట్టుకున్న బ్రిటీష్‌ వారిని ఇప్పుడు భారతీయులే దిక్కయ్యారు. కరోనాతో ఆ దేశ రాణి (కోవిడ్ వచ్చినట్లు వార్తలు వచ్చినా.. అధికారికంగా ప్రకటించక లేదు), యువరాజు, ప్రధాని, ఆరోగ్య శాఖ మంత్రి ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇక ఇలాంటి సమయాల్లో సాధారణంగా గ్రేట్ బ్రిటన్‌ను ఇంఛార్జ్ చేసే అవకాశం ఛాన్సలర్ ఆఫ్ ఎక్సెక్వర్‌ గానీ.. హోమ్ సెక్రటరీగానీ తీసుకుంటుంటారు. అయితే ఇప్పుడు ఆ పదవుల్లో ఉన్న ఇద్దరు(రిషి సునక్‌, ప్రీతి పటేల్‌) భారత సంతతికి చెందిన వారు కావడం విశేషం. 

ఈ నేపథ్యంలో ఓ మెసేజ్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అదేంటంటే.. 300 సంవత్సరాల తరువాత సూర్యుడు అస్తమించని దేశాన్ని భారతీయులు పరిపాలిస్తున్నారు అని. అంతేకాదు ప్రస్తుత పరిస్థితుల్లో రాబర్ట్ క్లైవ్‌, క్వీన్ విక్టోరియా, విన్‌స్టన్‌ చర్చిల్ ఆత్మలు సమాధుల్లో తిరుగుతూ ఉంటాయని కామెంట్ పెడుతున్నారు.